షాకింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చిన అక్కినేని కోడలు
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభితా రాణా,కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది.ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా కూడా పాల్గొంది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది.
ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చిన హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. వీరిద్దరు తమ హానీమూన్ పీరియడ్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇటీవలే 'వోగ్' మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను షేర్ చేసింది.
ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమిచ్చి అందరినీ ఫిదా చేసింది. అందులో ఆమె కుంభకోణంలోని రామస్వామి టెంపుల్‌ను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వాటికి మ్యాగ్నిఫికెన్స్ అనే క్యాప్షన్ కూడా జోత చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత అందం మరింత పెరిగిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, పెళ్లి తర్వాత శోభిత పూర్తిగా మారిపోయిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత ధూళిపాళ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications