స్టార్ హీరో ఇంటి పక్కనే దిగిన హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది త్రిప్తి డిమ్రీ. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ మారిపోయింది. యానిమల్ సినిమాలో త్రిప్తి డిమ్రీ గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అందం, అభినయం, గ్లామర్‌తో కట్టిపడేసింది.యానిమల్ సినిమా కన్నా ముందే పలు సినిమాల్లో నటించినప్పటికి రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందనే చెప్పాలి.
ఈ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. యానిమల్ సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. అలాగే ఇటు తెలుగులో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. త్రిప్తి డిమ్రి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను వంటి చిత్రాల్లో నటించింది. కానీ బుల్ బుల్ చిత్రంతోనే ఫేమస్ అయ్యింది.

ఇక యానిమల్ సినిమా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్కీ విద్య కా వో వాలా వీడియో, భుల్ భూలయా 3, బ్యాడ్ న్యూస్, దఢక్ 2లో నటిస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిప్తి ముంబైలో ఫ్లాట్‌ను కొనుగొలు చేసింది. ముంబైలో సెలబ్రెటీలు ఉండే బాంద్రా ఏరియాకు తన మకాం మార్చేసింది.ముంబైలో రణబీర్ కపూర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నివసించే బాంద్రా ఏరియాలో రెండంతస్తుల బంగ్లాను కొనేసిందట. సుమారు 247 గజాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇళ్లు ధర రూ.14 కోట్లు ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications