విజయ్ చివరి సినిమా.. థియేటర్‌లో త్రిష రచ్చ! (వీడియో)

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జననాయగన్' ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. దాదాపు 6 నెలలపాటు సెన్సార్ వివాదాలు, పలు అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో తమిళనాడుతో పాటు దక్షిణాదిలో పండగ వాతావరణం నెలకొంది. తొలి రోజు సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. దళపతి విజయ్ తన సినిమా కెరీర్‌కు ముగింపు పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ సినిమాను అభిమానులు ఓ జాతరలా వేడుక చేసుకుంటున్నారు.

జననాయగన్ సినిమా చూసిన త్రిష
సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా 'జననాయగన్'సినిమా చూసేందుకు థియేటర్లకు తరలివెళ్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ సన్నిహిత మిత్రురాలు, స్టార్ హీరోయిన్ త్రిష చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. థియేటర్ కు చేరుకున్న త్రిషను చూసి అభిమానులు, ప్యాపరాజీలు కెమెరాల్లో బంధించారు. ఎప్పటిలాగే దళపతి విజయ్ చివరి చిత్రానికి కూడా హీరోయిన్ త్రిష తన పూర్తి మద్దతు తెలిపారు.

Actress Trisha Krishnan Watched Thalapathy Vijay Final Movie Jananayagan at Rohini Theatre Video Viral

థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్
'జననాయగన్' చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బ్లాక్‌బస్టర్ లోడింగ్, సూపర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విజయ్ ఎంట్రీ సీన్స్, డ్యాన్సులు, విలన్ బాబీ డియోల్‌తో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశాలు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. అయితే వెండితెరపై ముఖ్యమంత్రి విజయ్ అని టైటిల్ పడటం, వేదికపై విజయ్ మాట్లాడే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చూస్తు తమ అభిమాన నటుడు మళ్లీ వెండితెరపై కనిపించడమే బాధతో చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

థియేటర్ల బయట జాతర
దేశ వ్యాప్తంగా 'జననాయగన్' దాదాపు 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదలైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళలో ఉదయం 6 గంటలకే షోలు ప్రారంభమవ్వగా.. తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి షోలు మొదలయ్యాయి. బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద విజయ్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లో అభిమానులు విజయ్ కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. దీంతో పాటు బాణాసంచా కాలుస్తూ.. డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+