100 శాతం ఎఫర్ట్ పెట్టాను... ఇంట్లో కూర్చోమన్నారు: సమంత
సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత తాజాగా శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. వివాహ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంలో నాగచైతన్య మాజీ భార్య సమంత పెళ్లికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని అభిమానులు మాత్రం ఈరోజు కాకపోయినా రేపైనా నాగచైతన్య-సమంత కలిసిపోతారనే ఆశలో ఉన్నారు. అనుకోనివిధంగా చైతూకు నిశ్చితార్థం జరగడంతో అందరూ షాక్ అయ్యారు.
నాగచైతన్యతో విడిపోయిన కొత్తలో సమంత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె మాట్లాడుతూ విడాకులకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత తన స్నేహితులుకానీ, కుటుంబ సభ్యులుకానీ తనకు ఒకటే మాట చెప్పారన్నారు. ఐటం సాంగ్ చేయొద్దన్నారని, ఇంట్లో కూర్చోమన్నారని, అందులోను విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత ఐటం సాంగ్ చేయడం సరికాదన్నారని సమంత చెప్పింది. ఆ పాట చేయకుండా ఉండేందుకు నువ్వు నో చెప్పాలంటూ సన్నిహితులంతా చెప్పారని సమంత వెల్లడించింది.

తానేం తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎందుకు దాక్కోవాలని, తన వివాహానికి వంద శాతం ఎఫర్ట్ పెట్టానని, కానీ అది కుదర్లేదన్నారు. అలా అని తనను తాను తక్కువ చేసుకోను అన్నారు. ఏం చేయనిదానికి తాను ఎందుకు ఫీలవ్వాలని సమంత ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ప్రతి విషయాన్ని సవాలుగా తీసుకొని పనిచేయాలని చెప్పిన స్నేహితులే ఐటం సాంగ్ చేస్తానంటే చేయకన్నారని, కానీ తాను చేస్తానని చెప్పానన్నారు. సమంత చేసిన హనీబన్నీ సిరీస్ నవంబరు ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే మాంటి బంగారం సినిమా చేస్తోంది. తమిళంలో విజయ్ తో, మళయాళంలో మమ్ముట్టితో, బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో సినిమాలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications