అభిషేక్ బచ్చన్‌కు షాక్..విదేశాలకు వెళ్లిపోయిన ఐశ్వర్య రాయ్
బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్థారణకు వచ్చేశారు. ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కొడలు ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు.
ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకున్నారు. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.

ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఇదిలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పనితో వీరి విడాకులు ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులకు సంబంధించిన పోస్ట్‌కు లైక్ కొట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తు ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై విమానాశ్రయంలో ఐశ్యర్య, ఆరాధ్య మాత్రమే కనిపించడం, అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి ఈ జంట విడాకులు గురించి చర్చకు వచ్చింది. ఐశ్యర్య ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో నెటిజన్లు అభిషేక్ బచ్చన్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భార్యా పిల్లల్ని మర్చిపోయాడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, ఎలాగూ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య,మళ్లీ పెళ్లి చేసుకోవాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications