అక్కినేని అఖిల్ 'లెనిన్' ట్రైలర్ రివ్యూ: అయ్యగారు ఈసారి గట్టిగానే కొట్టేట్టు ఉన్నాడే..!
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూవీ 'లెనిన్'.. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మూడు నిమిషాల 9 సెకన్లపాటు ఉన్న ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. చివరి వరకూ ఆసక్తి కరంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే అక్కినేని అఖిల్ ఈసారి గట్టిగానే కొట్టేట్టు ఉన్నాడే అని సోషల్ మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇది మహాభారతం.. చిత్తూరు జిల్లాలో ప్రతి ఏటా ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మను కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన ఎట్టిపరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు.. అనే నాగార్జున వాయిస్ ఓవర్ ట్రైలర్ పై ఆసక్తిని మరింతగా పెంచింది. ఆ తర్వాత అఖిల్, భాగ్యశ్రీ బోర్సే ఇంట్రడక్షన్ బాగున్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగానే పండినట్టు స్పష్టం అవుతోంది.

ఇక ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు.. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు.. ఆ పొద్దు నుంచి శ్రీరామపురంలో అసలు మహాభారతం మొదలైంది. అనే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. నన్ను దాటి ఈ వసంత్ గాన్ని తాకండ్రా సూద్దాం.. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. చివరగా మీ కాళ్లు పట్టుకుంటాన్నా.. భారతిని వదిలేయండ్రా.. అది నా ప్రాణం.. అని అక్కినేని అఖిల్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. కురుక్షేత్రంలో ఆఖరిగట్టం విశ్వరూపం అని చివరగా సునీల్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఇక ట్రైలర్ చివరలో మొత్తం రక్తపాతం కనిపిస్తోంది. మొత్తానికి లెనిన్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని తెలుస్తోంది. ఈ మూవీతో అయ్యగారు గట్టిగానే హిట్టు కొట్టేట్టు ఉన్నాడే.. అని అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన్న ఈ విలేజ్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అద్దిరిపోయిన నేపథ్యంలో అక్కినేని అఖిల్ కు హిట్టు పక్కా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications