నాగచైతన్య-శోభిత పెళ్లి తేదీ ఖరారు.. వేదిక అక్కడే
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య అకస్మాత్తుగా శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకొని ఆశ్చర్యపరిచారు. సమంతను ప్రేమించి పెళ్లిచేసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు పైగా అన్యోన్యంగా కాపురం చేశారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నప్పటికీ ఎప్పటికైనా కలవకపోతారా అనే ఆశతో అక్కినేని అభిమానులతోపాటు సమంత అభిమానులు ఎదురు చూశారు. అయితే శోభితతో వివాహం ఖాయం కావడంతో వీరి ఆశలన్నీ అడియాశలయ్యాయి. నిశ్చితార్థం జరుపుకోవడానికి ముందు నాగచైతన్య-శోభిత ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ వాటిని శోభిత ఖండించింది.
మంచి ముహూర్తం కావడంతో
ఈనెల ఎనిమిదోతేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో నాగార్జున ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. మంచి ముహూర్తం కావడంతో దాన్ని వదులుకోకూడదని హడావిడిగా నిశ్చితార్థం జరిపినట్లు అక్కినేని కుటుంబం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్విటర్ లో ఉంచి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగచైతన్య-శోభిత ప్రేమానురాగాలతో చిరకాలం జీవించాలని ఆశీర్వదించారు. వివాహం ఏ తేదీన జరపాలి? ఎక్కడ జరపాలి? అనే విషయంలో అక్కినేని కుటుంబ సభ్యులు సమాలోచనలు చేస్తున్నారు.

ఫిబ్రవరిలో లేదంటే మార్చిలో
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదంటే మార్చి నెలలో వివాహం చేయాలని నిర్ణయించారు. పెళ్లిని రాజస్థాన్ లేదంటే మధ్యప్రదేశ్ లోని చారిత్రక ప్రదేశాల్లో చేయనున్నారు. ఈ రెండుచోట్ల కుదరకపోతే విదేశాల్లో చేసే అవకాశం ఉందంటున్నారు. మరో ఆరునెలల్లోగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు నాగచైతన్య పలువురు దర్శకులతో కథాచర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications