అఖిల్ "లెనిన్" మూవీపై నాగార్జున రివ్యూ.. "పెద్ది"తో పోటీకి సై !!

అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం "లెనిన్". మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే విడుదల కావాల్సిన ఈ సినిమా పెద్ది కోసం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ విడుదల విషయంలో వస్తున్న రూమర్లపై నాగార్జున ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

నాగార్జున రివ్యూ..

లెనిన్ చిత్రం జూన్ 26 న విడుదలవుతుందని నాగార్జున స్పష్టం చేశారు. తాను ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కట్ చూశానని.. ఇది అఖిల్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా మీరు ఈ సినిమాలో సరికొత్త అఖిల్‌ను చూస్తారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది అని నాగార్జున పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

akkineni-nagarjuna-review-on-akhil-lenin-movie-and-release-date-also-announced-on-social-media

అయితే ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. కానీ రామ్ చరణ్ నటించిన "పెద్ది" చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బాక్సాఫీస్ వద్ద పోటీని నివారించడానికి 'లెనిన్'ను జూన్ 26కు వాయిదా వేశారు. కానీ మళ్లీ పెద్ది సినిమా కూడా జూన్ 25కు వాయిదా పడటంతో.. లెనిన్ మరోసారి వెనక్కి వెళ్తుందేమో అన్న చర్చ మొదలైంది. కానీ నాగార్జున ప్రకటనతో ఈ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని ఖరారైంది.

మొత్తానికి చాలా కాలం తర్వాత అఖిల్ నుంచి వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో, ఈ చిత్రం అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మూడు సంవత్సరాల విరామం తర్వాత అఖిల్ తెరపైకి రానుండటం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా 'ఏజెంట్' తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ఈసారి హిట్ తప్పదనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. నాగార్జున పాజిటివ్ రివ్యూ ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+