ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా!

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 'హిను-మాన్' చిత్రంతో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరిస్తూ.. "మహాకాళి" అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుచి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అక్షయ్ ఖన్నా ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండటం విశేషం.

శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా
ఈ సోషియో-ఫాంటసీ చిత్రంలో అక్షయ్ ఖన్నా 'శుక్రాచార్యుడి' పాత్రలో కనిపిస్తున్నారు. తన విలక్షణమైన నటనతో, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అక్షయ్ ఈ పాత్రకు ప్రాణం పోశారని చిత్ర బృందం పేర్కొంది. సాధారణంగానే అక్షయ్ ఖన్నా తన నటనతో ఏ పాత్రనైనా పండించగలరు. అలాంటిది 'ధురంధర్' వంటి భారీ సినిమా తర్వాత ఆయన ఈ క్షిష్టమైన పౌరాణిక నేపథ్యం ఉన్న పాత్రను పోషించడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినిమా యూనిట్ భావిస్తోంది.

Akshaye Khanna Wraps Shoot for Mahakali as Shukracharya Prasanth Varma Cinematic Universe

బర్త్ డే కానుకగా స్పెషల్ అప్‌డేట్
అక్షయ్ ఖన్నా బర్త్ డే సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేకమైన ఫోటోను విడుదల చేశారు. ఈ ఫోటోలో అక్షయ్ ఖన్నా తన శుక్రాచార్యుడి గెటప్‌లో ఉండగా.. దర్శకురాలు పూజా అపర్ణ కొల్లూరు, ప్రశాంత్ వర్మలతో లోతైన చర్చలు జరుపుతూ కనిపిస్తున్నారు. ఇదే సమయంలో చిత్ర బృందం మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. అక్షయ్ ఖన్నా తన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అక్షయ్ ఖన్నాసెట్‌లో ఉన్నంత కాలం తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారని సమాచారం.

వంద రోజుల షూటింగ్ పూర్తి.. విజువల్ వండర్‌గా 'మహాకాళి'
ఆర్కేడీ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి విడతగా 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి విజువల్ గ్రాండ్‌నెస్ తీసుకురావడానికి మల్టీ-స్టూడియో వీఎఫ్ఎక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. పౌరాణిక కథాంశం కావడంతో గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

త్వరలో రివీల్ కానున్న రిలీజ్ డేట్
భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న"మహాకాళి" సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా డైరెక్టర్ ్రశాంత్ వర్మ మార్క్ మేకింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగం కూడా పెంచారు. షూటింగ్ పూర్తయిన వెంటనే త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం ధ్రువీకరించింది. 'హిను-మాన్' లాగే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+