మా నాన్న సమయానికి వచ్చి చితకబాదకపోతే.. లైంగిక వేధింపులపై నటి

ప్రముఖ రియాలిటీ షో 'లాకప్2' నటీమణులు తమ జీవితాల్లో దాగి ఉన్న చేదు నిజాలను బయటపెడుతుండటం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ప్రసారం 27వ ఎపిసోడ్‌లో ప్రముఖ కంటెంట్ క్రియేటర్, నటి శ్రేయా కల్రా, నటి శివాంగి జోషి ఇద్దరూ చిన్నతనంలో తమ సొంత బంధువుల నుంచే ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. హోస్ట్‌లుగా ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుండగా.. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

 డబుల్ ధమాకా: రెండు భాగాలుగా అల్లు అర్జున్ 'రాకా'?
డబుల్ ధమాకా: రెండు భాగాలుగా అల్లు అర్జున్ 'రాకా'?

13 ఏళ్ల వయస్సులో కజిన్ వేధింపులు
'లాకప్2' షోలోని ఓ టాస్క్ సందర్భంగా ప్రముఖ కంటెంట్ క్రియేటర్, నటి శ్రేయా కల్రా రహస్యాన్ని బయపెట్టింది. శ్రేయా కల్రా తన జీవితంలో జరిగిన దారుణ సంఘటన గురించి వెల్లడించింది. "నాకు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు నా సొంత కజిన్ నన్ను లైంగికంగా వేధించాడు. అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని వయసులో అతన నా పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ విషయం బయటకు చెప్తే కుటుంబం బాధపడుతుందని.. ముఖ్యంగా నా తల్లి తట్టుకోలేదని ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు" అంటూ శ్రేయా కల్రా ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తి తల్లిని తన తల్లి మూడేళ్లు చూసుకుందని.. కుటుంబాల్లో గొడవలు రావద్దని ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదని శ్రేయా పేర్కొంది.

Shivangi Joshi and Shreya Kalra Reveal Shocking Child Abuse Secrets On Lock Upp Seson 2 Details

సొంత మేనమామే కామాంధుడై..
శ్రేయా ధైర్యాన్ని చూసిన నటి శివాంగి జోషి కూడా తన చిన్నతనం ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లికి సోదరుడైన మేనమామే తన వేధించాడని చెప్పారు. "నేను ముంబై వెళ్లి నటనలో రాణించాలని అనుకున్నప్పుడు మా మేనమామ ఎంతో సపోర్ట్ చేసినట్లు నటించాడు. స్కూల్ నుంచి తీసుకొచ్చే నెపంతో నాకు కారు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి తన ఒడిలో కూర్చోబెట్టుకుని అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడు. చిన్న పిల్లనైన నాకు అప్పట్లో అతని ఉద్దేశం అర్థం కాలేదు" అని నటి శివాంగి జోషి గుర్తు చేసుకుంది.

'ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?
'ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?

మా నాన్న సరైన సమయానికి రావడంతో ప్రమాదం తప్పింది!
మరో సంఘటనను వివరిస్తూ శివాంగి జోషి మరింత ఉద్వేగానికి లోనయ్యారు. "ఒకరోజు ఇంట్లో అమ్మానాన్నలు లేని సమయంలో మామయ్య వచ్చి.. ముంబై వెళ్లి నటిస్తే అన్ని రకాల సీన్లకు సిద్ధంగా ఉండాలంటూ.. బెదిరించి నాపై దాడి చేశాడు. బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా.. నేను అతడిని పక్కకు నెట్టివేశాను. కోపంతో నన్ను నేలపైకి విసిరికొట్టాడు. సరిగ్గా అదే సమయంలో మా నాన్న ఇంటికి వచ్చి.. నా అరుపులు విని లోపలికి వచ్చి అతడిని చితకబాది ఇంట్లోంచి తరిమివేశారు. ఈ సంఘటన తర్వాత తీవ్ర భయంతో నేను చాలా రోజుల వరకు ఇల్లు దాటి బయటకు రాలేకపోయాను" అని శివాంగి జోషి వెల్లడించారు.

ఈ వీడియో వైరల్ కావడంలో శివాంగి జోషి తల్లి స్పందించారు. పిల్లలకు చిన్ననాటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. శ్రేయా కల్రా, శివాంగి జోషి ఇద్దరూ తమ జీవితాల్లోని చీకటి కోణాన్ని ధైర్యంగా బయటపెట్టడంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+