'పొలిమేర'దర్శకుడితో అల్లరి నరేష్ దెయ్యం సినిమా.. టీజర్ చూశారా..?
టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేష్ కెరీర్ మొదట్లో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. తర్వాత ఆయన పంథా మార్చుకున్నారు. ప్రత్యేకమైన కథాంశాలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుసబెట్టి మూవీస్ చేస్తున్నాడు. ఆయన ఇటీవల నటించిన బచ్చల మల్లి, ఆ ఒక్కటి అడక్కు చిత్రాలు బాక్సాఫీస్ ముందు పరాజయం పాలయ్యాయి. అయితే తాజాగా నాని కాసరగడ్డ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి '12ఎ రైల్వే కాలనీ'టైటిల్ ఫిక్స్ చేశారు. 'పొలిమేర','పొలిమేర 2' సినిమాలకి పనిచేసిన రైటర్, డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ కథను అందించారు. అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అనిల్ అందించారు.

అయితే తాజాగా '12ఎ రైల్వే కాలనీ టీజర్' విడుదలైంది. టీజర్ హార్రర్ నేపథ్యంతో థ్రిల్లింగ్గా ఉంది. "ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించవు" అనే డైలాగ్తో టీజర్ మొదలై సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేసింది. 'ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న...!'అంటూ టీజర్ చివర్లో నరేశ్ చెప్పే డైలాగ్ ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఇందులో కనిపించే పాత్రలు ఒక్కటిగా చూపిస్తూ ఆసక్తి రేపారు.
ఈ చిత్రానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతం అందించారు. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ తో పాటు డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు.












Click it and Unblock the Notifications