పవన్ కల్యాణ్ సెలబ్రేషన్స్‌కు హాజరుకాని అల్లు అర్జున్
తాజాగా వెల్లడైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు.. రాష్ట్రంలో మొత్తం పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. చరిత్రలో వందకు వందశాతం గెలుపు అనేది ఏ పార్టీకి లేదు. భవిష్యత్తులో కూడా రాబోదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవి ఇంటికి వచ్చారు. గెలుపొందిన తర్వాత మొదటిసారి కావడంతో చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగబాబు కుటుంబ సభ్యులతోపాటు మెగా ఫ్యామిలీకి సంబంధించినవారంతా అక్కడికి చేరుకున్నారు.
విభేదాలున్నాయంటూ ప్రచారం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కానీ, అతని తండ్రి అల్లు అరవింద్ కానీ, ఇతర సోదరులుకానీ హాజరుకాలేదు. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య రోజురోజుకు దూరం పెరుగుతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రామ్‌చరణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ తెలుగు ఫిలిం నగర్ వర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పోటీకి దిగిన పవన్ కల్యాణ్ కు ట్వీట్ ద్వారా విషెస్ చెప్పి, తన స్నేహితుడైన రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తుండటంతో స్వయంగా అక్కడికి వెళ్లి మద్దతు ప్రకటించారు.

ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు
పవన్ కల్యాణ్ గెలుపొందగా కిషోర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అల్లు అర్జున్ మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోయాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. పవన్ కల్యాణ్ విజయం సాధించిన తర్వాత ట్వీట్ ద్వారా బన్నీ శుభాకాంక్షలు తెలియజేశాడు. వ్యక్తిగతంగా కలవలేదు. మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్న వేడుకల్లో బన్నీ పాల్గొనకపోవడంపై వార్తలు వైరలవుతున్నాయి. ఈ వేడుకల్లో పవన్ కల్యాణ్, అతని భార్య, కొడుకు అకిరా నందన్, చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఉపాసన, సురేఖ, చిరంజీవి తల్లి అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తోపాటు ఇతర కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications