మెగా కాంపౌండ్ లో తళుక్కుమన్న మలయాళ స్టార్- ఊహాగానాలకు ఆజ్యం?
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహ తేదీ దగ్గరపడుతోంది. తన ప్రియురాలు నయనికతో కలిసి ఈ నెల 6వ తేదీన పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు అల్లు వారి ఇంట ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ వేడుకగా సాగుతోంది. ఈ పెళ్లి పనులన్నింటినీ కూడా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి దగ్గరుండి చూసుకుంటోన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.
అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు అరవింద్ కుటుంబం. ఈ సందర్భంగా వారు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పట్లో పెళ్లి తేదీని వెల్లడించలేదు. ఈ ఏడాది పెళ్లి జరుగుతుందనే హింట్ అప్పుడే ఇచ్చారు. దీనికి అనుగుణంగా మార్చి 6వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారు.

కాగా- ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు మలయాళ స్టార్ హీరో- దర్శకుడు బాసిల్ జోసెఫ్ హాజరయ్యాడు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ టాక్ కు దారి తీసింది. అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్ట్ గురించిన ఊహాగానాలకు దారితీసింది. బాసిల్ జోసెఫ్ త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టవచ్చని, సూపర్‌స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పని చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ కు అటెండ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లో విస్తృతంగా వ్యాపించాయి. దీంతో బాసిల్, అల్లు అర్జున్ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారా అనే చర్చకు దారితీసింది. సినిమా ఫోరమ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారం ఊపందుకుంది. ఏదో ఆసక్తికర ప్రాజెక్ట్ సిద్ధమవుతోందంటూ రెడ్డిట్ యూజర్లు వ్యాఖ్యానించారు. బిగ్ ప్రాజెక్ట్ లోడింగ్.. అంటూ ఎక్స్ లో నెటిజన్లు కామెంట్స పోస్ట్ చేస్తోన్నారు. బాసిల్ జోసెఫ్ లేదా అల్లు అర్జున్ నుండి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
బాసిల్ జోసెఫ్ మలయాళీ సూపర్ హీరో చిత్రం 'మిన్నల్ మురళి'తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. టోవినో థామస్ నటించిన ఈ చిత్రం అతన్ని మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ దర్శకులలో ఒకడిగా నిలిపింది. అప్పటి నుండి, బాసిల్ నటనపై కూడా దృష్టి సారించాడు. ప్రధాన పాత్రలు పోషిస్తూనే, దర్శకత్వానికీ ప్రాధాన్యత ఇస్తోన్నాడు. మే లో విడుదల కానున్న 'అతిరాది' చిత్రంలో బాసిల్ నటించాడు.
-
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే











Click it and Unblock the Notifications