'పుష్ప2'పై వ్యూహం మార్చిన అల్లు అర్జున్... పవన్ కల్యాణ్‌కు డైరెక్ట్ సవాల్?

అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల నుంచి ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి లావా ఎగసిపడినట్లుగా ఎగసిపడ్డాయి. పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు ట్వీట్ ద్వారా సరిపెట్టి, నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా స్వయంగా అక్కడికి వెళ్లాడు అల్లు అర్జున్. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానుల మధ్య, అల్లు అర్జున్ అభిమానుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

వ్యూహాన్ని రచించిన అల్లు అర్జున్
అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ పోలీసులు కేసు పెట్టడంతో దీన్ని కొట్టేయాలంటూ ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు త్వరలోనే రానుంది. ఇటువంటి సమయంలోనే పుష్ప2 ఆగస్టు 15నే విడుదల కావాల్సి ఉండగా వివాదాల నేపథ్యంలో నిర్మాతలు డిసెంబరు 5కు వాయిదా వేశారు. అప్పుడు కూడా మెగా అభిమానుల నుంచి, పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పవని, సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తారని భావించిన అల్లు అర్జున్ అందుకు విరుగుడుగా అద్భుత వ్యూహం పన్నారు.

Allu Arjun changed his strategy on Pushpa 2 direct challenge to Pawan Kalyan

అల్లు హీరోలదే పై చేయి అనేలా
ప్రపంచవ్యాప్తంగా పుష్ప2ను 11,500 థియేటర్లలో విడుదల చేసేలా వ్యూహం రచించారు. దీనివల్ల మొదటి మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగివచ్చే అవకాశం ఉంది. మెగా అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు చేసే వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకొని సినిమా సేఫ్ గా నష్టాల్లేకుండా బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని భావించారు. సినిమాకు మంచి టాక్ వస్తే భారీ కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా హీరోగా తన స్టామినాను నిరూపించుకునే అవకాశం దక్కుతుంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లువుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఇండియాలో 6,500 థియేటర్లు, ఆరు భాషల్లో, విదేశాల్లో 5,000 థియేటర్లలో విడుదలవుతుండటంతో నష్టాలకు తావులేకుండా ప్రణాళిక రచించారు. ఈ సినిమాతో మెగా హీరోలకంటే అల్లు హీరోదే పైచేయి అని నిరూపించే ప్రయత్నాల్లో అల్లు అర్జున్ ఉన్నారు. ఎంతవరకు విజయవంతమవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+