pushpa2 collection: ఇండియాలో అతిపెద్ద ఓపెనర్‌గా 'పుష్ప2'
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన పుష్ప2 భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రికార్డులపై పుష్ప2 దృష్టిపెట్టాడు. మొదటిరోజు ఈ సినిమా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటిల్లో సింహ భాగం కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఏపీ, తెలంగాణ నుంచి రూ.95.1 కోట్లు రాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో రూ.72 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు తొలిరోజు రికార్డు రాజమౌళి దర్శకత్వంలోని ఆర్ఆర్ఆర్ సినిమా పేరుమీద ఉండేది. ఆ సినిమా తొలిరోజు రూ.133 కోట్లు రాబట్టింది.
కల్కి రికార్డు బద్దలు
పుష్ప2 సినిమాకు అమెరికాలో తొలిరోజు రూ.35 కోట్లు వచ్చాయి. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇది మూడోస్థానంలో నిలిచింది. తమిళంలో రూ.7 కోట్లు, కేరళలో రూ.5 కోట్లు, కన్నడంలో కోటిరూపాయలు రాబట్టింది. ఈ వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.250 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ నెట్ వసూళ్లు. బుక్ మై షోలో గంటలోనే లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు కల్కి పేరుమీద ఉండేది. దీన్నికూడా బీట్ చేసింది.

అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది
ఇండియాలో అతి పెద్ద ఓపెనర్ గా నిలిచిన పుష్ప2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. బాహుబలి2 సినిమా ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ సినిమా రికార్డును బద్ధలు కొట్టడమే పుష్ప2 లక్ష్యంగా ఉంది. అంతవరకు వెళుతుందా? లేదా? అనేది చూడాలి. టికెట్ ధరలు అధికంగా ఉండటంతో రెండోరోజు నుంచి ఈ సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకులు కనపడటంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు దారుణంగా పెంచడంపై అభిమానులే తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్కో టికెట్ జీఎస్టీ కూడా కలుపుకొని రూ.1239గా ఉంది. మొదటి వారం కొంత, తర్వాత వారం కొంత... ఇలా విడతలవారీగా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు ఇవ్వడంపై సినీ ప్రియులు కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.












Click it and Unblock the Notifications