డబుల్ ధమాకా: రెండు భాగాలుగా అల్లు అర్జున్ 'రాకా'?
దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రాకా' సినిమా ప్రస్తుతం క్రేజీ బజ్ ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈలోగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలువడింది. అల్లు అర్జున్ రాబోయే చిత్రం 'రాకా' ఇప్పుడు మరింత భారీ స్థాయిలో నిర్మించబడుతోంది. సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ నివేదిక ప్రకారం, 'రాకా' కథను రెండు వేర్వేరు ప్రపంచాలు, కాలాల్లో చూపించనున్నట్లు సమాచారం. దాని ప్రకారం .. ఈ సినిమా కథ రెండు భాగాలుగా ఉంటుంది: ఒకటి వేద కాలంలోని గిరిజన పురాణాల ఆధారంగా ఉండగా.. మరొకటి ఆధునిక కాలంలో జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద సినిమా అనుభవాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. 'రాకా' చిత్రాన్ని రెండు భాగాలుగా, విభిన్న కాలాల్లో రూపొందించే ఫ్రాంచైజ్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఓ భాగం గిరిజన పౌరాణిక వేద కాలంలో, మరొకటి ప్రస్తుత కాలంలో సాగుతుంది.

ఈ చిత్రంలోని రెండు కాలాల్లో కథానాయికలు ఎలా ఇమిడిపోతారో కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం.. ఆధునిక కాలంలో మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొనె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న చారిత్రక భాగంలో భాగం కానున్నారు. సినిమా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
ఈ చిత్రం దాని భారీ స్థాయి, బహుళ తారాగణం, అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీల కాంబినేషన్ కారణంగా ఇప్పటికే భారీ అంచనాలను అందుకుంది . రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఫార్మాట్, చిత్ర నిర్మాతలకు పురాణ కథను, ప్రపంచ నిర్మాణాన్ని మరింత విస్తరించడానికి అవకాశం కల్పిస్తుందని, తద్వారా 'రాకా' ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.ఎంతో చర్చనీయంగా ఉన్న షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర ఇంకా చిత్రీకరించబడలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక పాత్ర కోసం అంతర్జాతీయ షెడ్యూల్ ఉంటుందని ఆ వర్గాలు సూచించాయి. రెండు భాగాలుగా విడుదల చేసే వ్యూహంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ తాజా పరిణామాలపై చిత్ర నిర్మాతలు గానీ, నటీనటులు గానీ స్పందించలేదు.












Click it and Unblock the Notifications