నయనతారతో చేయనంటున్న అల్లు అర్జున్.. ఆ అవమానమే కారణం!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ నయనతారకు అసలే పడడం లేదని, నయనతార పేరు ఎత్తితేనే అల్లు అర్జున్ మండి పడుతున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే అల్లు అర్జున్ నయనతారని ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? వారిద్దరి మధ్య ఉన్న వివాదం ఏమిటి? నయనతార అల్లు అర్జున్ కి ఎందుకు నచ్చలేదు? అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పుష్ప మూవీతో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప 2 లో కూడా తన మార్కు చూపిస్తున్న అల్లు అర్జున్ ఏమాత్రం తగ్గేదే లేదని తేల్చి చెప్తున్నాడు. అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం సర్వం సిద్ధమైందని చిత్ర దర్శకుడు సుకుమార్ వెల్లడించిన విషయం కూడా మనకు తెలిసిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్ మూవీ లో హీరోయిన్ గా నయనతారకు అవకాశం వచ్చినా అల్లు అర్జున్ మాత్రం తన సినిమాలో ఆమె వద్దే వద్దని తేల్చి చెబుతున్నాడట. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నయనతారతో కలిసి యాక్ట్ చేయాలని చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆమెతో చేయనని అంటున్నారు.
అందుకు కారణం లేకపోలేదు. ఆ మధ్య ఒక ఈవెంట్లో నయనతారకు అల్లు అర్జున్ అవార్డు ప్రధానం చేయాల్సి ఉండగా, ఆమె ఆ అవార్డును బన్నీ చేతులమీదుగా తీసుకోవడానికి నిరాకరించి, తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలని కోరుకోవడం తో స్టేజ్ పైకి వెళ్ళిన అల్లు అర్జున్ ఆమెకు అవార్డు ఇవ్వకుండానే స్టేజ్ దిగి వెళ్లిపోయారు.
ఇక ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ కాస్త హర్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మరింత హర్ట్ అయ్యారు. స్టేజీ మీదికి వెళ్ళకముందే చెప్పి ఉంటే బాగుండేదని, అలాకాకుండా స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత అవార్డును బన్నీ చేతుల నుంచి తీసుకోవడానికి నిరాకరించడం, అవమానించడమేనని ఫ్యాన్స్ భగ్గుమన్నారు.
ఇక ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్ నయనతార విషయంలో పాజిటివ్ గా లేరని సమాచారం. ఈ కారణంగానే తాజాగా ఆయన ఓ సినిమాలో తనతో హీరోయిన్ గా నయనతార వద్దని తేల్చి చెప్పారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.












Click it and Unblock the Notifications