allu arjun కు అరుదైన గౌరవం: ఈరోజు చాలా స్పెషల్.. ఎందుకంటే!!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు భారత సినిమా చరిత్రలోనూ, ప్రపంచవ్యాప్తంగాను అల్లు అర్జున్ కు తనదైన గుర్తింపు ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి ఉన్న అభిమాన గణం అంతా ఇంతా కాదు. ఇంత అభిమాన గణాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ కు తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు జాతీయ స్థాయిలో ఆయన జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్న తెలుగు హీరోగా రికార్డు సృష్టించారు. అటువంటి అల్లు అర్జున్ కు దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన కీర్తి కిరీటంలో మరొక కలికితు రాయిలా ఇది మారింది.

allu arjun wax statue in Madame Tussauds museum icon star said it s very special

నిన్న రాత్రి ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ జరిగింది. అచ్చం పుష్ప స్టైల్ లోనే విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. అచ్చం తనలానే ఉన్న మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత అల్లు అర్జున్ అచ్చం విగ్రహం లాగా, మైనపు బొమ్మ పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

అల్లు అర్జున్ మాత్రమే కాదు ఆయన కూతురు అర్హ కూడా విగ్రహం ఉన్న స్టైల్ లో స్టిల్స్ ఇస్తూ అక్కడ వారందరినీ ఆకట్టుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించిన అల్లు అర్జున్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తగ్గేదేలేదంటున్నారు.

ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్న అల్లు అర్జున్ నా 1వ చిత్రంగంగోత్రి ఈరోజు 2003లో విడుదలైంది .ఇక ఇదేరోజు నేను నా మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్‌లో ప్రారంభిస్తున్నాను. ఇది 21 సంవత్సరాల మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను అన్నారు. నా అభిమానుల అమితమైన ప్రేమ , సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

ఇలాంటి ప్రముఖ మ్యూజియంలో విగ్రహం ఏర్పాటు చేయడం ప్రతి నటుడి జీవితంలో మైల్ స్టోన్ అంటూ వ్యాఖ్యానించారు. మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+