దుబాయ్ డైరీస్: తమ్ముడిని 'క్లబ్‌'లోకి ఆహ్వానించిన అల్లు అర్జున్! (వీడియో)

మెగా హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. దుబాయ్ వేదికగా అల్లు శిరీష్ తన ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఎంతో స్టైలిష్‌గా, గ్రాండ్‌గా ప్రారంభించారు. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యాచ్‌పై అదిరిపోయే పార్టీ
దుబాయ్‌లోని సముద్ర తీరంలో ఓ విలాసవంతమైన యాచ్‌పై అల్లు శిరీష్ ఈ ప్రీ-వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. సూర్యాస్తమయం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో అల్లు బ్రదర్స్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ కలిసి షాంపేన్ బాటిల్స్‌ను ఓపెన్ చేస్తూ సందడి చేశారు. శిరీష్‌ను వివాహ జీవితంలోకి ఆహ్వానిస్తూ అల్లు అర్జున్ ఎంతో ఉత్సాహంగా తమ్ముడితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

Allu Sirish Pre-Wedding in Dubai Allu Arjun Welcomes Brother to the Married Club Video Viral

మార్చి 6న ముహూర్తం.. అల్లు అర్జున్ బాటలోనే శిరీష్!
అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది. ఈ తేదీ అల్లు కుటుంబానికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సరిగ్గా ఇదే తేదీన (మార్చి 6) వివాహం చేసుకున్నారు. తన అన్న పెళ్లి చేసుకున్న రోజే తమ్ముడు శిరీష్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుండటం అల్లు ఫ్యామిలీలో మరింత భావోద్వేగాన్ని నింపింది.

స్టైలిష్ లుక్‌లో అల్లు దంపతులు
ఈ వేడుకలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ బ్లాక్ అండ్ గోల్డ్ వెర్సాచే ప్రింటెడ్ సిల్క్ షర్ట్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించగా.. స్నేహా రెడ్డి సాఫ్ట్ పింక్ డ్రస్‌లో క్లాసీ లుక్‌తో మెరిశారు. వీరిద్దరి ఫోటోలను చూసి నెటిజన్లు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ సింగర్ సోఫీ చౌదరి కూడా ఈ వేడుకలో పాల్గొని పార్టీ ఫోటోలను షేర్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+