తాగునీటితో ఫ్లోర్ క్లీనింగ్.. 'అక్షయకల్ప ఫార్మ్స్'కు రూ.20,000 జరిమానా.. డ్రైనేజీ కనెక్షన్ కట్

హైదరాబాద్ నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ మహానగర జల మండలి నిఘాను ముమ్మరం చేసింది. అమూల్యమైన తాగునీటిని ఇతర పనులకు వాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా, జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ ఆర్గానిక్ డెయిరీ ఉత్పత్తుల సంస్థ 'అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్' కార్యాలయానికి జలమండలి అధికారులు రూ.20,000 జరిమానా విధించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని జర్నలిస్ట్స్ కాలనీలో అక్షయకల్ప ఫార్మ్స్ కార్యకలాపాలు సాగిస్తోంది. సదరు ప్రాంగణంలో తాగునీటిని వృథా చేస్తూ, ఆ నీటితో కార్యాలయ ఫ్లోరింగ్ (నేలలు) కడుగుతున్నట్లు జలమండలి తనిఖీ బృందం గుర్తించింది. గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం సరఫరా అవుతున్న విలువైన తాగునీటిని నిర్లక్ష్యంగా ఫ్లోర్ క్లీనింగ్‌కు ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అధికారులు వెంటనే స్పందించారు.

Hyderabad Water Board Slaps 20 000 Fine on Akshayakalpa Farms for Misusing Drinking Water in Hyderabad

సంస్థ ప్రతినిధులకు రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆ భవనానికి ఉన్న డ్రైనేజీ కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు. నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రతి రోజూ ఎంతో వ్యయప్రయాసలకోర్చి గోదావరి, కృష్ణా జలాలను నగరానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.

స్పష్టమైన నిబంధనలు: ప్రభుత్వం సరఫరా చేసే పైపులైన్ తాగునీటిని కేవలం తాగడానికి, వంటకు, అత్యవసర గృహ వినియోగానికి మాత్రమే వాడాలి. తాగునీటి పైపులను నేరుగా పెట్టి వాహనాలు కడగడం, కార్యాలయాల ఆవరణలను శుభ్రం చేయడం, గార్డెనింగ్, భవన నిర్మాణ పనులకు ఉపయోగించడం చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు.

వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు ఫ్లోరింగ్ క్లీనింగ్ లేదా మొక్కల పెంపకానికి స్థానిక మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి వచ్చే రీసైకిల్డ్ నీటిని మాత్రమే వినియోగించుకోవాలని జలమండలి స్పష్టం చేసింది. తాగునీటిని వృథా చేస్తూ పట్టుబడితే భారీ జరిమానాలు విధించడమే కాకుండా, నీటి మరియు మురుగునీటి కనెక్షన్లను శాశ్వతంగా రద్దు చేసే అధికారం చట్ట ప్రకారం బోర్డుకు ఉంటుంది.

దీపావళి తర్వాత భారీగా పెరగనున్న బిర్యానీ ధరలు.. బిర్యానీ లవర్స్ కు షాక్!
దీపావళి తర్వాత భారీగా పెరగనున్న బిర్యానీ ధరలు.. బిర్యానీ లవర్స్ కు షాక్!

రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో ఎక్కడా నీటి కొరత తలెత్తకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు, వ్యాపార సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే జలమండలి టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+