ఎంపీటీసీల్లో వెయ్యి మార్కు దాటిన వైసీపీ..! ఇంత ప్రభంజనంలోనూ..!

ఏపీలో తాజాగా నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. సాయంత్రం 7 గంటల కల్లా విడుదలైన ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతోంది. 9829 జడ్పీటీసీల్లో 7350 సీట్ల లెక్కింపు పూర్తయింది. వీటిలో కూటమి పార్టీలు 6 వేలకు పైగా సీట్లను సాధించాయి. అలాగే విపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) వెయ్యికి పైగా ఎంపీటీల్ని తమ ఖాతాలో వేసుకుంది. తాజా లెక్కల ప్రకారం 1161 సీట్లను వైసీపీ గెల్చుకుంది. ఈ సంఖ్య పూర్తి ఫలితాలు వచ్చే సరికి మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!
స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!

1000కు పైగా ఎంపీటీసీ స్థానాలు సాధించి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ట్వీట్ చేశారు. మూడు పార్టీల కూటమి అధికార బలం ముందు ప్రజాబలం తలవంచలేదన్నారు. బెదిరింపులకు భయపడలేదు. దౌర్జన్యాలకు వెనక్కి తగ్గలేదన్నారు. 2 వేలకు పైగా స్థానాల్లో నామినేషన్లు అడ్డుకుని, భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నా... అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాతీర్పును మాత్రం ఆపలేకపోయారని ఆయన తెలిపారు. 1000కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనమని అన్నారు.

YSRCP Crosses 1 000 MPTC Seats Calls Rural Local Body Results a Warning to TDP Alliance
బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!
బొత్స కూతురికి షాక్ - కోడలు, సోదరి, సిరి సహస్ర ఆధిక్యం- మజ్జి శ్రీనుకు అక్కడ ఝలక్..!

మూడు పార్టీలు కలిసినా... ప్రజల మద్దతు ముందు నిలవలేకపోయాయంటూ యనమల నాగార్జున యాదవ్ తెలిపారు. గుర్తుంచుకోండి... అధికారం మీ చేతుల్లో ఉండొచ్చు... కానీ ప్రజాభిమానం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది సాధారణ విజయం కాదు... ప్రజాబలం చాటిన రాజకీయ హెచ్చరిక! అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే జడ్పీటీసీ సీట్ల విషయానికొస్తే.. మొత్తం 659 సీట్లలో ఇప్పటివరకూ 430 సీట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కూటమి 300 సీట్లు గెల్చుకుని, మరో 99 సీట్లలో ఆధిక్యంలో ఉంది. వైసీపీ మాత్రం 14 సీట్లు మాత్రమే గెల్చుుకుంది. మరో 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులకు ఓ సీటు దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+