school holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవంబర్ 9 న స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ప్రస్తుతం దీపావళి సెలబ్రేషన్స్ లో ఉన్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. నవంబర్ 9 సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దీపావళి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ఇది భారీగా ఊరటను కలిగించే అంశం అని చెప్పొచ్చు. నవంబర్ 9న సెలవు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకూ వర్తించనుంది. రాష్ట్రంలోనే ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే ఫెస్టివల్ కావడంతో ఈ పండుగ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. నవంబర్ 9 సెలవు అనంతరం పాఠశాలలు తిరిగి సాధారణ షెడ్యూల్ ప్రకారం కొనసాగనున్నాయి.

ఇక వాంగాలా ఫెస్టివల్ ను మేఘాలయ రాష్ట్రంలో ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. వాంగాలా ఫెస్టివల్ ను 1000 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ పండగను ఈశాన్య భారత్ లోని మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఘారో అనే తెగ ఏటా నిర్వహిస్తుంటుంది. ఇది ఒక సాంస్కృతిక పండుగ. తమ తెగ సంస్కృతి, సంప్రదాయాలను అలాగే ఔన్నత్యాన్ని.. అక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలిపేలా ఈ పండగ ఉంటుంది. ప్రస్తుతం మేఘాలయలో పంటల సీజన్ పూర్తయింది. అయితే ఈ సీజన్ పూర్తయిన తర్వాత ప్రకృతికి, వ్యవసాయానికి.. అలాగే సమృద్ధికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏటా ఈ పండగను ఘనంగా నిర్వహిస్తుంటారు. తమ భాషలో సూర్య భగవానుడైన మిసి సల్జోంగ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు.

Meghalaya government declares a holiday for schools on November 9 occasion of the Wangala Festival

ఏటా ఈ పండగ నవంబర్ 9 నుంచి 14 వరకు జరగనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ పండగలో సంప్రదాయ డ్రమ్స్ వాయిద్యాలు.. జానపద గీతాలు.. పాటల ఆలాపన.. ప్రత్యేక నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలాగే ఈ ఉత్సవంలో ముఖ్యంగా వందలాది మంది కళాకారులు సంప్రదాయ దుస్తులు ధరించి చేపట్టే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఈ పండగలో భాగస్వామ్యం కాావాలని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 9 న సెలవు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+