అల్లు శిరీష్ పెళ్లి సందడి.. మొదటి శుభలేఖ అందుకున్న మెగాస్టార్!

మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా శిరీష్ పెళ్లి గురించి జరుగుతున్న చర్చలకు తెరదించుతూ, వివాహ పనులు జోరుగా సాగుతున్నాయి. మార్చి 6వ తేదీన శిరీష్, నైనికల వివాహం అత్యంత వైభవంగా జరగనుంది.

చిరంజీవి దంపతులకు మొదటి ఆహ్వానం వివాహ పనుల్లో భాగంగా అల్లు శిరీష్ తన వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీని ప్రారంభించారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మొదటి శుభలేఖను తన మామయ్య, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు అందించారు. అల్లు అరవింద్ దంపతులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన శిరీష్.. వారికి పట్టువస్త్రాలు పెట్టి సాదరంగా ఆహ్వానించారు. అల్లు అరవింద్ తన ఇంటి ఆడపడుచు అయిన సురేఖమ్మకు మొదటి పత్రిక ఇవ్వడం ద్వారా అచ్చ తెలుగు సంప్రదాయాన్ని గౌరవించారు. దీనికి సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Allu Sirish Wedding First Invitation to Megastar Chiranjeevi Marriage with Nainika on March 6th

ప్రేమ వివాహం.. అన్నయ్య బాటలోనే శిరీష్!
అల్లు శిరీష్, నైనిక గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. నైనిక ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో, గత ఏడాది అక్టోబర్ 31న నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. విశేషం ఏంటంటే, అల్లు అర్జున్ లాగే శిరీష్ కూడా ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అంతేకాకుండా, అల్లు అర్జున్ పెళ్లి జరిగిన అదే తేదీన (మార్చి 6) శిరీష్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతుండటం విశేషం.

తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు
ఇప్పటికే అల్లు శిరీష్ ఇంట్లో 'పసుపు దంచే' కార్యక్రమం మెగా-అల్లు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో వేడుకగా జరిగింది. శిరీష్ ఇంటి చివరి అబ్బాయి కావడంతో, అల్లు అరవింద్ ఈ వివాహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఏర్పాట్లు మాత్రం అత్యంత వేగంగా జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+