అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప మూవీకి ముందు ఆ తర్వాత గా మారింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న 'రాకా' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే రాకా మూవీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ వైల్డ్ లుక్ బన్ని ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తోంది. ఇక ఈ మూవీ కోసం హాలీవుడ్​ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అలాగే హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా రాకా మూవీ విడుదలపై నెట్టింట చర్చ సాగుతోంది. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌ ను ఒకటే పార్టు కాకుండా ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా స్టోరీ గ్రాండ్ గా ఉండటంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక ఈ మూవీ విభిన్న టైమ్‌ లైన్స్, మల్టిపుల్ గెటప్స్‌ తో సాగుతుంది. ఈ క్రమంలోనే మూవీని రెండు భాగాలుగా తీసుకురావాలని అనుకుంటూ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేసి.. రెండో భాగాన్ని 2028 లో రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

AlluArjun Raaka movie be released in two parts However no official announcement from team so far

ఇక రాకా మూవీలో అల్లు అర్జున్ ట్రైబల్ వారియర్ అంటే గిరిజన యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని మేకర్స్ గతంలో రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు అర్థం అయిన సంగతి తెలిసిందే. మరి బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్- అట్లీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+