ధనుష్‌తో పెళ్లి వార్తల వేళ.. మృణాల్ ఠాకూర్ ఫస్ట్ వీడియో వైరల్!
దక్షిణాది సినిమాల నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్‌తో ఏడడుగులు వేయబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. వీరిద్దరూ ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారనే పుకార్ల నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఓ లేటెస్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
అజయ్ దేవగన్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ వేడుకలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ వార్తలపై మృణాల్ సన్నిహిత వర్గాలు స్పందించాయి. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, మృణాల్‌కు ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వారు స్పష్టం చేశారు.

వైరల్ అవుతున్న మృణాల్ వీడియో
పెళ్లి వార్తలు షికారు చేస్తున్న సమయంలో మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె ఓ పడవలో ప్రయాణిస్తూ, అందమైన సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోకు ఆమె "స్థిరంగా, వెలుగుతూ , అచంచలంగా!" (Steady, glowing, and unbothered!) అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన అభిమానులు ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నారని, ఈ రూమర్స్‌ను ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.
మౌనంగానే ధనుష్, మృణాల్
పెళ్లి వార్తలపై ధనుష్ కానీ, మృణాల్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. వీరిద్దరూ ప్రస్తుతం తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
-
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
విమానంలో నటికి చేదు అనుభవం.. ప్రయాణీకుడి వికృత చేష్టలు! వీడియో -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ ! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!!












Click it and Unblock the Notifications