రా అండ్ రస్టిక్ లవ్.. గుండెల్ని బరువెక్కించే ప్రేమ కథ!

విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అనకాపల్లి'. త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాతో ఖగేష్ దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రా అండ్ రస్టిక్ లవ్, రివేంజ్ డ్రామా ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఇక్కడ చూద్దాం.

టాలీవుడ్ బోల్డ్ కల్ట్ క్లాసిక్.. 'ఆరుగురు పతివ్రతలు' మళ్లీ వస్తుందిరోయ్!
టాలీవుడ్ బోల్డ్ కల్ట్ క్లాసిక్.. 'ఆరుగురు పతివ్రతలు' మళ్లీ వస్తుందిరోయ్!

స్టోరీ
అనకాపల్లి నేపథ్యంలో సాగే ఈ కథలో బుల్లెట్ ఒక తిరుగులేని రౌడీ. అదే ఊర్లో కరెంట్ ఆఫీసులో ఏఈగా పనిచేసే సాంబ శివ రావు (త్రినాథరావు నక్కిన) నిజాయితీగల మిడిల్ క్లాస్ మనిషి. ఆయన కొడుకే సూర్య (విక్రమ్ సహిదేవ్). తండ్రి సాధారణ జీవితం సూర్యకి నచ్చక, బుల్లెట్ యాటిట్యూడ్‌కి ఆకర్షితులై అతని గ్యాంగ్‌లో చేరి రైట్ హ్యాండ్‌గా ఎదుగుతాడు.ఈ క్రమంలో అమృత (సంధ్య వశిష్ట)తో సూర్యకి పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అయితే, తాను ఎంతో ఆరాధించిన బుల్లెట్, తాను ప్రేమించిన అమృత ఒక్కరిగా ఉండటాన్ని సూర్య చూడలేకపోతాడు. అసలు అమృత ఆ బుల్లెట్‌ని ఎందుకు ఇష్టపడింది? సూర్య ప్రేమ కథ ఎలా ముగిసింది? ఈ ప్రయాణంలో తల్లి జయంతి (ఇంద్రజ), తండ్రి, ఇతర పాత్రల ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే అసలు కథ.

Anakapalle Movie Review Raw and Rustic Village Love Drama Starring Vikram Sahidev Sandhya Vashista

కథనం
దర్శకుడు ఖగేష్ ఎంచుకున్న నేపథ్యం చాలా సహజంగా ఉంటుంది. కత్తి పట్టిన వాడు కత్తిపోటుకే బలి అవుతాడనే పాయింట్‌తో పాటు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పడే వేదన, ప్రేమకు-ఆకర్షణకు మధ్య తేడాను ఈ కథ ద్వారా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. బుల్లెట్ హంగామా, సూర్య గ్యాంగ్‌లో చేరడం, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ వంటి సన్నివేశాలతో సినిమా సాదాసీదాగా అనిపించినా, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పూర్తిగా ఎమోషనల్ జర్నీగా ,రివేంజ్ డ్రామాగా మారుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. సినిమా ముగింపు ప్రేమకు సరైన నిర్వచనంలా అనిపిస్తుంది.

Thella Kaagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. లవ్ స్టోరీకి కొత్త టచ్!
Thella Kaagitham Movie Review: తెల్లకాగితం మూవీ రివ్యూ.. లవ్ స్టోరీకి కొత్త టచ్!

నటీనటుల ప్రతిభ
సూర్య పాత్రలో విక్రమ్ సహిదేవ్ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ అన్ని కోణాల్లోనూ చక్కటి పరిణతితో నటించి మెప్పించారు.తారక్ పొన్నప్ప తన విలక్షణ నటనతో తెరపై భయపెట్టడమే కాకుండా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.సంధ్య వశిష్ట పద్ధతైన అనకాపల్లి అమ్మాయిగా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. త్రినాథరావు నక్కిన, ఇంద్రజ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులుగా జీవించేశారు. నిర్మాత కాండ్రేగుల నాయుడు డ్రగ్ డాన్‌గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు
అనకాపల్లి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా కెమెరా పనితనం ఉంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. తొలి సినిమా అయినప్పటికీ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా తెరకెక్కించారు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, చక్కటి గ్రామీణ వాతావరణం, మంచి భావోద్వేగాలు, బలమైన మలుపులతో సాగే 'అనకాపల్లి' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేవారిని బాగా అలరిస్తుంది.

రేటింగ్: 2.75/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+