పెళ్లికి ముందు ప్రియుడుతో కలిసి ఎంజాయ్ చేసిన అనసూయ..ఫొటోలు వైరల్
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి ఏమాత్రం చెక్కు చెదరని అందంతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది.

ఇక అనసూయది ప్రేమ వివాహం చేసుకుందనే విషయం అందరికి తెలిసిందే. సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని అనసూయ ప్రేమించి మరి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తాజాగా అనసూయ గతంలో తన భర్త సుశాంక్ భరద్వాజ్ ప్రియుడుగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో 'పెళ్లికి ముందు అనసూయ ఇలా ఉండేదా?' అంటూ కొందరు. 'పెళ్లికి ముందే ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసింది' అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందు అనసూయతో కలిసి ఎంజాయ్ చేసిందనే కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications