ఇంత చేతగానివాళ్ళా... విజయ్ దేవరకొండపై మళ్ళీ షాకింగ్ పోస్ట్ పెట్టిన అనసూయ!!

బుల్లితెరలో ప్రయాణం ప్రారంభించి వెండితెరలో వెలుగు వెలుగుతున్న అనసూయ భరద్వాజ్ ఏం చేసినా హాట్ టాపిక్ నే. మెయిన్ గా ఎక్స్ ఖాతాలో అనసూయ పెట్టే పోస్టులు చాలా కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తాయి. అనసూయ సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్,అనసూయ డ్రెస్సింగ్ స్టైల్, అనసూయ యాటిట్యూడ్ ప్రతి ఒక్కటి ఇండస్ట్రీలోనూ, జనాలలోను చర్చకు కారణంగా మారుతూనే ఉన్నాయి.

మళ్ళీ అనసూయ వ్యాఖ్యల రగడ
గతంలో తనను ఆంటీ అన్న వాళ్లపైన విరుచుకుపడిన అనసూయ లీగల్ యాక్షన్ తీసుకుంటానని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈమధ్య యంగ్ హీరో విజయ్ దేవరకొండను కెలికిన అనసూయ మళ్లీ తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టి విజయ్ దేవరకొండ ను వార్తల్లోకి లాగింది. అనసూయ, విజయ్ దేవరకొండ విషయంలో తాజాగా ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు చేసిన వ్యాఖ్యలతో మరోమారు రచ్చ మొదలైంది.

anasuya bharadwaj shocking post on vijay devarakonda

విజయ్ దేవరకొండ విషయంలో అనసూయ లేటెస్ట్ కామెంట్స్
సింబా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె నటించిన ఒక సీన్ పై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన అనసూయ విజయ్ దేవరకొండకు తనకు మధ్య పెద్ద గొడవలు ఏమీ లేవని ,స్టేజ్ మ్యానర్స్ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని, లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలని చెప్పానని, అంతకుమించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని పేర్కొన్నారు.

తాజాగా షాకింగ్ పోస్ట్ పెట్టిన అనసూయ
కానీ ఇక తాజాగా మరొకమారు అనసూయ భరద్వాజ్ చేసిన పోస్ట్ అందరిని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. మరీ ఇంత చేతగాని వాళ్ళ లాగా ఉంటే ఎలా అండి.. నిజంగా మీకు కాలుతుంది అంటే నా మీద కాదు అస్తమానం నేనేం చేసినా ఆ టాపిక్ లాగే వారిని అనండి.. మీకు దమ్ముంటే అంటూ పోస్ట్ చేశారు.

మీ హీరోలా ఆడవాళ్ళను దుర్భాషలాడటం మాత్రమే వచ్చు
కానీ మీరు అలా చేయరు కదా ఎందుకంటే మీకు అది చేతకాదు.. మీ హీరో లాగా ఆడవాళ్లను ఉద్దేశించి దుర్భాషలాడటం మాత్రమే వచ్చు కదా పాపం.. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. శుభరాత్రి అంటూ అనసూయ భరద్వాజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?
ఈ పోస్టు అనసూయ భరద్వాజ్ మళ్ళీ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ట్వీట్ చేశారా అన్నది ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక తాజా అనసూయ పోస్ట్ పైన మరోమారు విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీరిద్దరి మధ్య గొడవలకు చెక్ పడే అవకాశం లేదా అంటూ దీనిపైన నెట్టింట చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+