పవన్ కల్యాణ్‌కు సెక్యూరిటీ ఎలా ఉందో తెలుసా?
అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాలను కైవసం చేసుకున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ కు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పవన్ కల్యాణ్ అమరావతిలోని సచివాలయానికి వస్తున్నారు. రెండో బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారు. రేపు పవన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
సూర్యారావుపేటలోని గెస్ట్ హౌస్
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేసింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న జలవనరుల శాఖకు చెందిన అతిథి గృహాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో దీన్ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ హయాంలో బొత్స సత్యనారాయణ దీన్ని ఉపయోగించారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పేషీలు ఐదో బ్లాక్ లో ఉండేవి. ఇప్పుడు వీటిని రెండో బ్లాక్ కు మార్చారు.

ముఖ్యమంత్రికి అందుబాటులో ఉంటారని..
పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఈ బ్లాక్ లో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పేషీని ఇప్పటికే పురపాలకశాఖ మంత్రి నారాయణకు అప్పగించారు. ముఖ్యమంత్రి పేషీ ఒకటో బ్లాక్ దగ్గర ఉండటంతో.. పవన్ పేషీ రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని భావించిన ప్రభుత్వం ఇక్కడ కేటాయించింది. జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మూడు మంత్రి పదవులను కేటాయించింది. వారిలో నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖలను అప్పగించారు.












Click it and Unblock the Notifications