పాత కథను మసిపూసి మారేడుకాయ చేయబోతున్న చిరంజీవి-అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఆయనకు ఏదీ కలిసిరావడంలేదు. రాజకీయాల ప్రభావం అలా ఉంటుంది కాబోలు. కేవలం రెండు సినిమాలే హిట్ అయ్యాయి. రోజురోజుకు మార్కెట్ డౌన్ అవుతోంది. మరోవైపు తన సమకాలీనుడైన బాలయ్య వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్నారు. పాత చింతకాయపచ్చడిలాంటి కథలు, దర్శకులతో సినిమాలు చేస్తూ నేటి యువత ట్రెండ్ ను ఎలా పట్టుకోవాలో మర్చిపోతున్నారు.
అందుకు ఉదాహరణే చిరు కెరీర్ లో దారుణమైన సినిమాగా నిలిచిన భోళాశంకర్. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభర చిత్రానికి బడ్జెట్ ఎక్కువ కావడంతో అది ఆగిపోయింది. గ్రాఫిక్స్ చెత్తగా వచ్చాయని నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ కూడా బడ్జెట్ లోటుతో ఉండటంతోపాటు పెట్టిన పెట్టుబడైనా తిరిగి వస్తుందా? అనే సందేహంలో ఉంది.

తనదైన శైలిని కలపబోతున్న అనిల్ రావిపూడి
విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు చిరంజీవి పాత సినిమా గ్యాంగ్ లీడర్ కథకు కొన్ని మార్పుచేర్పులు చేసి.. అంటే మసిపూడి మారేడుకాయ చేసి. తనదైన శైలిలో పంచులు, మాస్ మసాలా, ఎంటర్టైన్మెంట్ ను అనిల్ కలపబోతున్నాడు. కొత్త కథలు రాసుకొని ఆ ప్రకారం తీసుకుంటే సినిమాలను ప్రేక్షకులు అంగీకరిస్తారుకానీ కథలు లేవంటూ, కథలకు కొరత ఉందంటూ పాత కథలనే తిప్పి తిప్పి ప్రేక్షకులపై రుద్దితే దాన్ని చూస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అనిల్ రావిపూడి అన్నీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే తీస్తారు.
సినిమా బడ్జెట్ వర్కౌట్ అవుతుందా?
ఆయనకు పరాజయం అన్నది లేదు. చిరంజీవి శైలికి తనదైన వినోద శైలిని కలిపి అనిల్ సినిమా తీయబోతున్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు చిరు రూ.85 కోట్ల పారితోషికం అడుగుతున్నారు. అనిల్ పారితోషికం రూ.25 కోట్లు. వీరిద్దరిదే అంత పారితోషికం బడ్జెట్ కిందపోతే మిగతావారికిచ్చేది కలుపుకొని సినిమా బడ్జెట్ సులువుగా రూ.200 నుంచి రూ.250 కోట్లు అవుతుంది. అసలు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా? అనే సందేహాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications