వేణు బాటలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో కమెడియన్; సముద్రఖనితో సినిమా!!
జబర్దస్త్ షో ద్వారా కమెడియన్లుగా పరిచయమైన వారు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కామెడీ షోలో నవ్వులు పంచిన ఎందరో కమెడియన్లు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు.
కమెడియన్ గా జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన షకలక శంకర్ సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు . కమెడియన్‌గా స్థిరపడే ప్రయత్నాలు చేశారు. కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే హీరోగా కూడా అవకాశం దక్కించుకున్నారు షకలక శంకర్. శంభో శంకర్ సినిమాలో హీరోగా నటించారు.

జబర్దస్త్ షో తో వచ్చిన పాపులారిటీ వల్ల సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలతో టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల జబర్దస్త్ కమెడియన్ వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను నేపథ్యంగా తీసుకుని సాగిన బలగం సినిమా ప్రేక్షకుల మన్నన పొందింది. దీంతో జబర్దస్త్ కమెడియన్ వేణు బలగం సినిమాతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించాడు. ఇప్పుడు వేణు బాటలోనే మరొక కమెడియన్ ధనరాజ్ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు.
ఒక కథను రెడీ చేసుకుని కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖనిని కలిసిన ధనరాజ్ తన కథతో సముద్రఖనిని మెప్పించారని సమాచారం. ధనరాజ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నాడని, దసరాకు ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
జబర్దస్త్ ద్వారా కమెడియన్ లుగా బుల్లితెరకు పరిచయమైన చాలామంది ఇప్పుడు, వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ధనరాజ్ నిర్మాతగా రెండు సినిమాలు తీసి నష్టపోయాడు. హీరోగా కూడా ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నాలలో ధనరాజ్ ఫెయిల్ అయ్యాడు. ఇక ప్రస్తుతం మళ్ళీ ధనరాజ్ మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడైనా ధనరాజ్ సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications