టాలీవుడ్ లో విడాకులు తీసుకున్న మరో జంట

తెలుగు సినీ పరిశ్రమలో విడాకులు తీసుకోవడం చాలా సాధారణమైన విషయంగా మారిపోతోంది. కొద్దికాలం ప్రేమించుకున్నామనిపించుకోవడం.. తర్వాత పెళ్లి చేసుకున్నామనిపించుకోవడం.. నాలుగు రోజులకే అభిప్రాయ భేదాలొచ్చాయని, సరిపడటంలేదంటూ విడిపోతున్నామని ప్రకటించడం అనేది ఒక ఫ్యాషనలా మారిపోయింది. కొంతమంది విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించేవారు కూడా ఉన్నారు. మరికొందరు మాత్రం సింగిల్ గానే ఉండిపోతున్నారు.

తాజాగా పరిశ్రమకు చెందిన సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తన భార్యతో విడిపోయినట్లు ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత్ 2020లోనే మంజు నుంచి విడిపోయానని, ఇటీవలే విడాకులు సంబంధించిన ప్రక్రియ అంతా ముగిసిందని, విడివిడిగానే జీవిస్తున్నామని చెప్పారు. అయితే మంజు ఇప్పటికీ తనకు ఎంతో మంచి స్నేహితురాలని, ఆమెను మంచి స్నేహితురాలిగానే పిలవానుకుంటున్నానన్నారు. విడిపోయిన తర్వాత మంజు కెరీర్ విజయవంతంగానే సాగుతోందని, ఈ విషయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

another couple divorced in the telugu film industry

తెలుగులో సుజిత్ నాలుగు సినిమాలకు పనిచేశారు. 2000లో మళయాళ నటి మంజు పిళ్లైని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఎంతమంది విడాకులు తీసుకుంటున్నప్పటికీ సమంత-నాగచైతన్య తీసుకున్న విడాకుల వ్యవహారం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనాన్ని కలిగించింది. వారిద్దరు ఇప్పటికీ కలిసిపోతే తిరిగి చూడాలనుకునే అభిమానులే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని సమంత సన్నిహితులు సోషల్ మీడియాకు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+