కోర్టు మెట్లు ఎక్కిన మరో స్టార్ హీరో, హీరోయిన్ జంట
ప్రస్తుత కాలంలో కొంతకాలం ప్రేమించుకోవడం, లేదంట సహజీవనం చేయడం, ఆ తర్వాత అభిప్రాయాలు కలవలేదంటూ విడిపోవడం సినీ పరిశ్రమలో సహజంగా మారిపోయింది. ప్రేక్షకులు, సినీ ప్రియులు కూడా ఇవన్నీ మామూలే అని ఎవరూ పట్టించుకోవడంలేదు. అకస్మాత్తుగా ఎవరైనా విడిపోయినప్పుడు మాత్రం షాక్ కు గురవుతున్నారు. నాగచైతన్య-సమంత విడిపోయినప్పుడు కూడా సినీ ప్రియులు ఇలాగే షాక్ కు గురయ్యారు. తాజాగా మరో స్టార్ హీరో, హీరోయిన్ జంట కోర్టు మెట్లెక్కింది. వారెవరో కాదు కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యష్, అతని భార్య, హీరోయిన్ రాధికా పండిట్.
కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా
యష్, అతని భార్య రాధికా పండిట్ కోర్టు మెట్లెక్కింది విడాకుల కోసం కాదు.. మరేదైనా గొడవ జరిగో కాదు.. కేవలం ఒక వాణిజ్య ప్రకటన కోసమే కోర్టు తలుపు తట్టారు. ఈ వాణిజ్య ప్రకటన ఫ్రీడం ఆయిల్ కంపెనీకి సంబంధించినది. కొన్నాళ్ల నుంచి ఈ కంపెనీకి యష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా యాడ్ ను మార్చి కొత్త యాడ్ ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో న్యాయవాదిగా యష్, జడ్జిగా తనికెళ్ల భరణి, మోసపోయిన వినియోగదారుగా రాధికా పండిట్ నటించారు. తాను ఎన్నోరకాల వంట నూనెలను వాడుతున్నప్పటికీ మోసపోతున్నానని కోర్టుకెళుతుంది రాధికా పండిట్.

కంపెనీ తరఫున వాదించి గెలిచిన యష్
ఫ్రీడం ఆయిల్ కంపెనీకి, ఇతర వంటనూనెలకు ఉన్న తేడాను కోర్టులో యష్ నిరూపిస్తాడు. ఇతర నూనెలతో చేసిన గారెలను, ఫ్రీడం ఆయిల్ తో చేసిన గారెలను జడ్జి ముందు పెడతారు. ఆయన రెండింటినీ రుచిచూస్తారు. ఫ్రీడం ఆయిల్ తో చేసిన గారెలు అద్భుతంగా ఉన్నాయంటారు. ఇలా ఫ్రీడం తరఫున కోర్టులో వాదించి గెలిచిన న్యాయవాదిగా యష్ నటించారు. ప్రస్తుతం ఈ వాణిజ్య ప్రకటన బాబా పాపులర్ అవుతోంది. యష్ ప్రస్తుతం న 19వ సినిమా టాక్సిక్ చేస్తున్నారు. మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన దేశవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. రామాయణం సినిమాలో కూడా రావణుడిగా యష్ నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications