పెళ్లి చేసుకునేది పనిమనిషిని కావడానికా... అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌తో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనుపమ పరమేశ్వరన్. మలయాళీ అమ్మాయే అయినా తన నటనతో తెలుగువారి అభిమానాన్ని పొందారు. గ్లామర్ రోల్స్‌కు దూరంగా కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ ముద్దుగుమ్మ. హిట్, ఫ్లాప్‌లకు అతీతంగా ప్రేక్షకులను అలరించడమే తన కర్తవ్యం అని నమ్మే అతికొద్దిమంది నటీమణుల్లో అనుపమ కూడా ఒకరు. అయితే గత కొంతకాలంగా ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై అనుపమ పరమేశ్వరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే

2015లో మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అనుపమ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో తెలుగువారిని పలకరించారు. అనంతరం ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హాలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్, కార్తీకేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై, ఈగల్, టిల్లూ స్క్కేర్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తన మార్క్ చూపించారు.

Anupama Parameswaran Opens Up About Marriage and Motherhood Reveals Her Views on Relationships

కోలీవుడ్ స్టార్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ ప్రేమలో పడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి జంటగా ఫంక్షన్‌లకు హాజరుకావడం, ఇతర కార్యక్రమాల్లో కనిపించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయ్యింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అభిమానులు భావిస్తున్న సమయంలో అనుపమ పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. తాను ఇకపై ఎవరి అనుమతితో బతకాల్సిన అవసరం లేదంటూ రాసుకొచ్చి బ్రేకప్‌పై హింట్ ఇచ్చారు. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో తన ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్ కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడినట్లు చెప్పి కన్నీటి పర్యంతమైంది.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఆమె నటించిన క్రేజీ కళ్యాణం మూవీ అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌తో అనుపమ మాట్లాడుతూ.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకోమని నా తల్లిదండ్రులు చెబుతుంటారు.. నాకు కూడా పిల్లల్ని కనాలని, మాతృత్వాన్ని అనుభవించాలని ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో పనిచేయడం వల్ల నాకు ప్రాంతీయ వివాహ సాంప్రదాయాలపై అవగాహన ఏర్పడింది. కేరళ, తెలంగాణల్లోని వివాహాన్ని పోల్చి చూస్తే.. ఇక్కడ వివాహాలు సాంప్రదాయకంగా నిరాడంబంగా శాకాహారంగా ఉంటాయి. కానీ తెలంగాణలో విభిన్న రకాల ఆచారాలు, పద్ధతులు పరిచయమయ్యాయని అనుపమ తెలిపారు.

కేరళలోనూ ఇప్పుడు పెళ్లిళ్లు కాలక్రమేణా మారాయి.. హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. తమ ముందు తరాల వారు కేవలం నిశ్చితార్ధం, వివాహ వేడుకలకే పరిమితం అయ్యేవారు. తన తాజా చిత్రం క్రేజీ కళ్యాణంలో రిలేషన్ అంటే ఏంటో లోతుగా చర్చిస్తుంది. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషకరమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి తోడ్పడాలి. కానీ స్త్రీని కేవలం ఇంటి పని మనిషిగా మార్చకూడదు. ఈ సినిమాలోని నా పాత్ర కీర్తి కూడా ఇదే చెబుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇదే. అలాగే కేవలం డబ్బు కోసమే సినిమాలను చేయాలని నేను అనుకోవడం లేదని అనుపమ తేల్చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+