కాక్రోచ్ లకు భారీ ఊరట..! రేపటి ధర్నాపై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో వరుసగా ఆందోళనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులపై కేంద్రం ఢిల్లీ పోలీసుల సాయంతో ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే కాక్రోచ్ పార్టీ కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ అరెస్టు అయి జ్యుడిషియల్ కస్టడీపై తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆందోళనలు (CJP Protest ) ఉధృతం చేయాలని నిర్ణయించిన సీజేపీ.. ఈ నెల 16న అంటే రేపు కన్నాట్ ప్లేస్ లో భారీ సభకు పిలుపునిచ్చింది. దీనిపై దాఖలైన ఓ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.

రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!
రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!

కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టకుండా అడ్డుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కాక్రోచ్ నిరసనకారుల్ని అదుపు చేయడానికి చట్ట ప్రకారం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసుకుంది. దీంతో ఢిల్లీ పోలీసులు సీజేపీ నిరసనల్ని సజావుగా సాగేలా సహకరించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. మరోవైపు సీజేపీ చేపడుతున్న నిరసనల్లో చేరేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సిద్దమవుతోంది. అటు ఇండియా కూటమి కూడా అదే సమయంలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.

CJP Protest at Connaught Place Gets Green Light as Delhi High Court Leaves Regulation to Police
కేంద్ర మంత్రి రాజీనామా..! ఢిల్లీ నిరసన వేళ అనూహ్య పరిణామం..!
కేంద్ర మంత్రి రాజీనామా..! ఢిల్లీ నిరసన వేళ అనూహ్య పరిణామం..!

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టే నిరసనలకు అనుమతిపై విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. ఇవాళ ఒక లైసెన్స్ పొందిన వీధి వ్యాపారి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. కాక్రోచ్ ల నిరసన వ్యాపారుల హక్కులను ప్రభావితం చేస్తుందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి అనుగుణంగా దీనిని నియంత్రించాలని పోలీసులను ఆదేశించాలని ఆ వ్యాపారి కోరారు. పండుగ సీజన్‌లో సెంట్రల్ ఢిల్లీలో మూసివేతల కారణంగా మరో వారాంతాన్ని కోల్పోతే, వ్యాపారులు, విక్రయదారులు వీధుల్లోకి వస్తారని అతని తరఫు న్యాయవాది వాదించారు. దీంతో అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. సీజేపీ కార్యకలాపాలను నియంత్రించడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు. దీంతో నిరసనను అడ్డుకునేందుకు అనుమతి నిరాకరిచిన హైకోర్టు.. పోలీసులు దీన్ని నియంత్రించేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+