"మోడీ ఇంత చేస్తున్నారంటే.. జ్ఞానేష్ ఇంకెంత?"-యూట్యూబర్ ధృవ్ రాఠీ ప్రశ్న..!

ఎస్ఐఆర్ అక్రమాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వీటిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను రక్షించేందుకే ఇలా వేల సంఖ్యలో నిరసనకారుల్ని నిర్బంధించడం, దాడులు చేయించడం చేస్తోందంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. అయినా కేంద్రం వీటిని పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు. ఈ నేపథ్యంలో సీఈసీ కోసం ప్రధాని మోడీ, కేంద్రం ఎందుకింత పట్టుదలకు పోతున్నాయనే చర్చ పెరుగుతోంది.

జ్ఞానేష్ వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం- ఈసీలో డిప్యూటీ కమిషనర్ నియామకం..!
జ్ఞానేష్ వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం- ఈసీలో డిప్యూటీ కమిషనర్ నియామకం..!

ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కోసం ప్రధాని మోడీ ఇంత చేస్తున్నారంటే .. ప్రధాని కోసం ఆయన ఎంత చేసి ఉంటారన్న ప్రశ్నను యూట్యూబర్ ధృవ్ రాఠీ (Dhruv Rathee) సంధించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ధృవ్ రాఠీ.. జ్ఞానేష్‌ను కాపాడటానికి మోదీ ఏమేమి చేస్తున్నారో చూడండి.. మోదీని కాపాడటానికి జ్ఞానేష్ ఏమేమి చేశారో ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తుందంటూ వ్యాఖ్యానించారు. తద్వారా మోడీ తనకు చేసిన సాయానికి జ్ఞానేష్ రుణం తీర్చుకుంటున్నారనే అర్దం వచ్చేలా ఈ ట్వీట్ చేశారు.

Dhruv Rathee Takes Dig at PM Modi Over Efforts to Save CEC Gyanesh Kumar

ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!
ఫామ్ 6 మార్పులపై సుప్రీం బిగ్ ట్విస్ట్..! సీఈసీ జ్ఞానేష్ కు ఊరట..!

ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నా, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు దాఖలవుతున్నా, కేంద్రం మాత్రం సీఈసీ విషయంలో నోరు మెదపడం లేదు. దానికి బదులుగా నిరసనలకు దిగుతున్న విపక్షాలను అడ్డుకునేందుకు ఢిల్లీలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తోంది. తద్వారా తాత్కాలికంగా నిరసనల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో దశాబ్దాలుగా నిరసనలకు కేంద్రంగా ఉన్న జంతర్ మంతర్ ను మూసేసి, ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేసుకోమని సూచిస్తోంది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+