Travishek: ముగిసిన 'ట్రావిషేక్' శకం- ట్రావిస్ హెడ్ కు అభిషేక్ ఘన వీడ్కోలు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పలు విజయవంతమైన జోడీలు ఉన్నాయి. వీటిలో గత కొన్నేళ్లలో అద్భుత ప్రదర్శనతో ట్రావిషేక్ జోడీగా పేరు తెచ్చుకున్న భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆస్ట్రేలియా మేటి బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ జోడీకి తాజాగా శుభం కార్డు పడింది. ట్రావిస్ హెడ్ తన అంతర్జాతీయ కమిట్‌మెంట్లతో పాటు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. దీంతో కొన్నేళ్లుగా ఐపీఎల్ టోర్నీల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకంగా మారిన ఈ ఓపెనింగ్ జోడీకి బ్రేక్ పడినట్లయింది.

Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!
Ind Vs NZ Test: న్యూజీలాండ్ తో టెస్టులకు బౌలింగ్ ప్లాన్ మార్పు- గిల్ ప్రకటన..!

ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన సక్సెస్ ఫుల్ ఐపీఎల్ పార్ట్ నర్ ట్రావిస్ హెడ్ నిర్ణయంపై స్పందించాడు. ఈ మేరకు ఇన్ స్టా లో ట్రావిస్ హెడ్ ను ఉద్దేశించి ఓ సెండాఫ్ మెసేజ్ పెట్టాడు. 'థ్యాంక్యూ హెడీ ఫర్ ఎవిరిథింగ్' అంటూ అభిషేక్ శర్మ పోస్టు చేశాడు. దీంతో అభిమానులు ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన జోడీ విడిపోయినందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా బాధ పడుతున్నారు. అయినా హెడ్ నిర్ణయాన్ని గౌరవిస్తామంటున్నారు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాలన్న తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. హెడ్ ఎమోషనల్ అయ్యాడు.

IPL Abhishek Sharma 43 32 95 176 14 1351 - 42 46 14 1892 9 50 12 46 -

తన కుటుంబంతో గడపడానికి వీలుగా పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గడిపిన మూడు అద్భుతమైన సంవత్సరాల తర్వాత, ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో నా లక్ష్యాలను కొనసాగించాల్సిన అవసరం ఉండటం, నా కుటుంబంతో మెరుగైన సమతుల్య జీవితాన్ని గడపడం ముఖ్యమని భావించి, నా కెరీర్‌లో ఈ దశలో ఇదే సరైన నిర్ణయమని నమ్ముతున్నట్లు తెలిపాడు. తాము కలిసి సాధించిన విజయాల పట్ల తననకు చాలా గర్వంగా ఉందని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మంచి జ్ఞాపకాలుగా, ఎంతో విలువైన అనుభవంగా గుర్తుంచుకుంటానని హెడ్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

ధోనీ రిటైర్మెంట్ పై జగన్ ఆసక్తికర ట్వీట్..! సీఎస్కేలో కొత్త రోల్ పైనా..!
ధోనీ రిటైర్మెంట్ పై జగన్ ఆసక్తికర ట్వీట్..! సీఎస్కేలో కొత్త రోల్ పైనా..!

సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ 43 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 32.95 సగటు, 176.14 స్టైక్ రేట్ తో 1351 పరుగులు సాధించాడు. ఇందులో అభిషేక్ శర్మతో కలిసి ఆడిన ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ ఉన్నాయి. అభిషేక్-ట్రావిస్ హెడ్ జోడీ 42 ఇన్నింగ్స్ లో 46.14 సగటుతో 1892 పరుగులు సాధించారు. ఇందులో ఆరుసార్లు వందకు పైగా భాగస్వామ్యాలు ఉన్నాయి. అలాగే 9 సార్లు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన భాగస్వామ్యాల్లో వీరిద్దరి రన్ రేట్ 12.46 ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ గా ఉంది. దీంతో వీరిద్దరి జోడీ ట్రావిషేక్ గా పేరు తెచ్చుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ జోడీగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ మాత్రమే అభిషేక్-ట్రావిస్ హెడ్ కంటే ఎక్కువ పరుగులు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+