"లూజర్స్ క్లబ్ లోకి జగన్..!"- కాక్రోచ్ లకు మద్దతుపై బీజేపీ ఘాటు కౌంటర్..!
ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ( ఎస్ఐఆర్) అక్రమాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఆందోళనలు సాగుతున్న వేళ కాక్రోచ్ జనతా పార్టీ నేతల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ బీజేపీకి (BJP) మంట పుట్టించింది. ముఖ్యంగా ఢిల్లి పరిణామాలను గుర్తుచేస్తూ, ఎన్నికల సంస్కరణలు కావాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాక్రోచ్ లకు మద్దతుగా జగన్ పెట్టిన ట్వీట్ ను ఉద్దేశించి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. మీరు ఇందులో ఎప్పుడు ప్రవేశిస్తారా అని ఎదురుచూస్తున్నానన్నారు. ఎందుకంటే మిగిలిన ఓడిపోయిన వాళ్లంతా ఇప్పటికే ఇందులో భాగమైపోయారని గుర్తుచేశారు. ఇక అసలు విషయానికి వస్తే - మీరు ఏ ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు? మీరు 151 అసెంబ్లీ స్థానాలను, 22 లోక్సభ స్థానాలను గెలుచుకున్న 2019 ఎన్నికల గురించా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. గుర్తుంచుకోండి, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం అవే కదా ఉన్నాయన్నారు.

I was wondering when you would jump into this, because all the other losers were already involved.Now, coming to the point - what electoral process are you referring to? The 2019 Assembly elections, in which you won 151 seats, and the Lok Sabha elections, in which you won 22 seats?Remember, the Central Govt and the Election Commission were the same at that time.So, when you win, everything is fine, but when you lose, the electoral process suddenly becomes bad?Also, it's ironic that you're speaking against the detention of people who violated bail conditions and disrespected the judiciary, when under your rule, people were wrongly imprisoned just for speaking against you.Do you want me to make a list of those victims? @ysjagan
— Satya Kumar Yadav (@satyakumar_y) October 15, 2026
అంటే, మీరు గెలిచినప్పుడు అంతా బాగుంటుంది, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఎన్నికల ప్రక్రియ అకస్మాత్తుగా తప్పుగా మారిపోతుందా? అని జగన్ ను సత్య కుమార్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా, బెయిల్ షరతులను ఉల్లంఘించి, న్యాయవ్యవస్థను అగౌరవపరిచిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడాన్ని మీరు తప్పుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. మీ పాలనలో, కేవలం మిమ్మల్ని విమర్శించినందుకే ఎంతోమందిని అన్యాయంగా జైలులో పెట్టారు కదా! అని అడిగారు. అలా బాధితులైన వారి జాబితాను నేను సిద్ధం చేయమంటారా? అని జగన్ కు బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ చురకలు అంటించారు. తద్వారా బీజేపీ తప్పుల్ని జగన్ గుర్తుచేస్తే.. గతంలో జగన్ చేసిన తప్పుల్ని మేం కూడా గుర్తుచేయగలమని సత్యకుమార్ హెచ్చరికలు పంపినట్లయింది.













Click it and Unblock the Notifications
