టిల్లు స్క్వేర్ సక్సెస్ వేడుకలో అనుపమకు అవమానం

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'టిల్లు స్క్వేర్' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డీజే టిల్లు‌కు సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా మార్చి 29న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.101.4 కోట్లు రాబట్టి థియేటర్లలో మోత మోగిస్తోంది. దీనికి సంబంధించి ఎనిమిదోతేదీన సక్సెస్ మీట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు అవమానం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. స్టేజ్ పై తారక్ కనిపించినప్పుడు ఆయన అభిమానులు అరుపులతో ఆడిటోరియాన్ని దద్దరిల్లేలా చేశారు. సక్సెస్ ఆనందంలో ఉన్న అనుప స్టేజ్ పై మాట్లాడటానికి వెల్లింది. అయితే కింద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆమెను మాట్లాడొద్దు.. మాట్లాడొద్దు అంటూ అరిచారు.

anupama parameswaran was insulted at the tillu square success function

తమ అభిమాన హీరో తారక్ స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడాలంటూ గోలగోల చేశారు. దీంతో అనుపమ బాధపడి వెళ్లిపోతుంటే యాంకర్ సుమ ఆమెను ఆపి మాట్లాడమని కోరింది. అయినా కింద అభిమానులు ఊరుకోకుండా అరుస్తూనే ఉన్నారు. దీంతో సుమ వారితో అనుపమను కనీసం ఒక్క నిముషమైనా మాట్లాడనివ్వండి అంటూ కోరింది. అయినా వారు వినలేదు. దీంతో అనుపమ చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపి కిందకు వెళ్లింది. అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశీర్వాదం తీసుకొని కూర్చుంది. దీంతో సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో అనుపమది కూడా ముఖ్యమైన పాత్ర అని, అటువంటిది ఆమెకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అక్కడి పరిస్థితులను సద్దుమణిగేలా చేసి ఆమెకు తగిన గౌరవం లభించేలా చూడటంలో కూడా చిత్రయూనిట్ ఫెయిలైందంటూ విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+