'దేవర'కు ఏపీ హైకోర్టు షాక్..నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కారు.. ఈ సినిమా టికెట్ రేట్స్‌ను 14 రోజులు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. 2 వారాల పాటు టికెట్ ధరలను పెంచుతూ తీసుకుంటూ ఇచ్చి మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంటూ టికెట్ ధరలను 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి, విడుదల రోజున ఆరు షోలు ప్రదర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వంఅనుమతి మంజూరు చేసింది. థియేటర్లలో బాల్కనీ ధర రూ.110, కుర్చీపై రూ.60 పెంచుకోవడానికి అనుమతిచ్చారు. మల్టీప్లెక్స్ లో టికెట్ పై రూ.135వరకు పెంచుకోవడానికి అనుమతి మంజూరైంది. 26వ తేదీ అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఆరు షోలకు, 28వ తేదీ నుంచి రోజుకు 5 షోలు వేసుకోవడానికి 9 రోజులపాటు అనుమతిచ్చారు. తెలంగాణలో ఈ సినిమాకు మొదటి రోజు మాత్రమే రూ. 100 పెంచుకోవడానికి అనుమతులు తీసుకున్నారు. రెండో రోజు నుంచి రూ. 50 హైక్స్ తో వారం రోజులు పాటు థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది.

అయితే ఏపీలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్ డిమాండ్ చేశారు.టికెట్ ధర పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరలను 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఏపీలో సినిమాకు భారీగా కలెక్షన్లు తగ్గిపోనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు పూర్తి నిరాశలో కురుకుపోయారు.












Click it and Unblock the Notifications