బిగ్‌బాస్ హౌస్‌లో శృంగారం..బయటపడ్డ వీడియో

సంచలనాలకు మారు పేరుగా బిగ్‌బాస్ రియాల్టీ షో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.

అయితే ఇది మన దేశ సంప్రదయాలకు విరుద్దంగా ఉందని చాలామంది ఈ షోపై విమర్శలు చేశారు. మిగిలిన భాషలతో పోలిస్తే...హిందీలో రొమాన్స్ కాస్తా ఎక్కువుగానే కనిపిస్తుంటుంది. ఈ షోకు వెళ్లి ప్రేమికులకు మారిన వారు కొందరైతే..అక్కడి వెళ్లి విడిపోయిన వారు మరికొందరు. ఇక బిగ్‌బాస్ షోలో ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా నిర్వహించారనే వార్త అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది.

Armaan Malik Wife Kritika Malik romance in bigg boss house

బిగ్‌బాస్ హౌస్‌లో శ‌ృంగారంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. 100 రోజుల పాటు తమ ఫీలింగ్స్‌‌ను ఎలా కంట్రోల్ చేసుకుంటారనే నెటిజన్ల ప్రశ్న. తాజాగా హిందీ బిగ్‌బాస్ శ‌ృంగారం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి హిందీ బిగ్‌బాస్ సీజన్‌కి అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో అర్మాన్ మాలిక్ అనే టిక్ టాక్ స్టార్ తన ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొన్నాడు.

ఇద్దరు భార్యల పాలసీని బిగ్‌బాస్ ప్రోత్సహిస్తోందని ఆల్రెడీ వారిపై చాలా నెగిటివిటీ వచ్చింది. ఇది చాలదన్నట్లు ఈ అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి తన మొదటి భార్య కృతికతో ఒకే మంచంపై లైంగిక కార్యక్రమాలకు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా బిగ్ బాస్ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం రోజురోజుకీ పోర్న్ కంటే దరిద్రంగా తయారవుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+