దీన్ని సినిమా అంటారా..? ప్రభాస్ మూవీపై ఆ నటుడు సంచలన వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రావత్ కాంబోలో వచ్చిన చిత్రం'ఆదిపురుష్'. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 390 కోట్లు వసూళ్లు మాత్రమే రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద ప్లాఫ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రల్లో మెరిశారు. అయితే 2023లో రిలీజైన ఈ సినిమా పరాజయంతో దర్శకుడు ఓమ్ రావత్.. ఇప్పటివరకూ తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.
2023లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమా డైలాగ్స్, కాస్ట్యూమ్స్, యాక్టర్స్ నటన, విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ మూవీకి ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అశుతోష్ రాణా 'ఆదిపురుష్' సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఫెయిల్ కావడానికి గల కారణాలు ఏంటని యాంకర్ ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. " ఓ హీరో లార్జర్ ధాన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చరిత్ర, కాస్ట్యూమ్స్ గురించి తెలుసుకోవాలి. డైలాగ్స్ పైన పట్టు ఉండాలి. వీటన్నింటి మీద దృష్టి పెట్టకపోతే.. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించరు. పౌరాణికాలపై ప్రేక్షకులకు పట్టు ఉంటుంది. వాటిని డిస్టర్బ్ చేస్తే ఎమోషనల్ అవుతారు." అని చెప్పుకొచ్చారు.

అయితే రామాయణ టీవీ షోను మాత్రం ప్రేక్షకులు విశేషంగా ఆదరించారని తెలిపారు. ఆ సీరియల్ లో రాముడి ఆకారం, వేశధారణ, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రావణుడి పాత్రలో తాను నటించానని.. ఇప్పటికీ తనను గుర్తుపెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆది పురుష్ సినిమాపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications