హనుమాన్ హీరో సంచలన నిర్ణయం
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలంలో అపురూపమైన రామమందిరం నిర్మితమైంది.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య సిద్ధమైంది. అయోధ్యాపురి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలన్నింటినీ కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

ప్రాణ ప్రతిష్ఠను జరుపుకోనున్న అయోధ్య రాముడికి టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్ టికెట్లపై వచ్చిన కలెక్షన్ల నుంచి కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనున్నారు. ఈ మొత్తం 2,66,41,055 రూపాయలు.
ఒక్కో టికెట్‌పై అయిదు రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామంటూ ఇదివరకే హనుమాన్ నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం వరకు 53,28,211 టికెట్లు అమ్ముడుపోయాయి. వాటిపై అయిదు రూపాయల చొప్పున మొత్తాన్ని లెక్కిస్తే 2,66,41,055 రూపాయలుగా తేలింది. దీన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా చెల్లించనుంది మూవీ యూనిట్.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన హనుమాన్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ షో కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది. కలెక్షన్ల విషయంలో గుంటూరు కారం, నాసామిరంగ, సైంధవ్ వంటి స్టార్ హీరోల సినిమాను వెనక్కి నెట్టింది. సంక్రాంతి సినిమాలన్నింట్లోనూ ఇదే హిట్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications