డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ మద్దతు కోరిన కేంద్రం..! 2 కండిషన్లు..!

గత పార్లమెంట్ సమావేశాల్లో సభలో 2/3 వంతు మెజార్టీ లేదని తెలిసీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)-మహిళా బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం.. వాటిని నెగ్గించుకునేందుకు విఫలయత్నం చేసింది. అప్పట్లో విపక్షం ఉమ్మడిగా ఈ బిల్లుల్ని ఓడించడంతో కేంద్రం వెనక్కి తీసుకుంది. తిరిగి ఆయా బిల్లుల్ని మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న కేంద్రం.. విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) మద్దతు కోరింది. దీనికి ఆయన సహజంగానే నో చెప్పేశారు.

మెటాకు కేంద్రం భారీ షాక్- జుకర్ బర్గ్ కు 3 రోజుల అల్టిమేటం..!
మెటాకు కేంద్రం భారీ షాక్- జుకర్ బర్గ్ కు 3 రోజుల అల్టిమేటం..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament monsoon session) ముందే టీఎంసీ, శివసేన, ఆప్ వంటి విపక్ష పార్టీల ఎంపీల్ని చీల్చి తమవైపుకు తిప్పుకున్న కేంద్రం.. ఇప్పుడు రాహుల్ గాంధీ మద్దతు కోరింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran rijiju) ఇవాళ రాహుల్ గాంధీతో భేటీ అయి రెండు గంటల పాటు చర్చలు జరిపారు. కేంద్రం ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నిస్తుందని, విపక్షం మద్దతు కావాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం అంతకు ముందే రామమందిర విరాళాల చోరీ, జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో చర్చలు జరపాలని కోరారు.

Rahul Gandhi Refuses Support for Delimitation Bill Seeks Discussions on Ram Mandir Jantar Mantar
ఆ దేశంతో భూభాగం మార్చుకోబోతున్న భారత్..! సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..!
ఆ దేశంతో భూభాగం మార్చుకోబోతున్న భారత్..! సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..!

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచీ ఇవే అంశాలపై ఉభయసభల్లోనూ విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా జంతర్ మంతర్ నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లులు కూడా ఈ సమావేశాల్లోనే పెడితే ఆమోదం కష్టమని భావించిన కేంద్రం..ఇందుకోసం ఆగస్టు 16 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి, లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాలేదు. ఈ గందరగోళం మధ్య ఐదు బిల్లులు చర్చ లేకుండానే ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+