బాలయ్య - మహేష్‌బాబు కాంబోలో మిస్ అయి బ్లాక్‌బస్టర్

అగ్ర కథానాయకుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్ చిత్రం అందించిన విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ చిత్రాలతో వరుసగా నాలుగు విజయాలు సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి రెండు సినిమాల దూరంలో ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 చేస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే డబుల్ హ్యాట్రిక సాధించి తొలి హీరోగా రికార్డ్ సృష్టించి తెలుగు సినీ చరిత్రలో తన పేరు ప్రత్యేకంగా లిఖించుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేయబోతున్నారు. రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిని మించి ఈ సినిమాను తీయాలనే పట్టుదలతో రాజమౌళి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. మొదటి పాన్ వరల్డ్ సినిమా అని చెప్పొచ్చు. దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. సినిమా రెండు భాగాలుగా ఉంటుందా? లేదంటే ఒక భాగమేనా? అనేది ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది.

balakrishna and mahesh babu combination movie missed

మంచి అవకాశాన్ని కోల్పోయిన తెలుగు ప్రేక్షకులు
బాలయ్య-మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా తీయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా ప్రయత్నాలు చేశారు. మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మెన్ తీసిన తర్వాత బాలయ్యతో పైసా వసూల్ తీశారు. వీరిద్దరి కాంబినేషన్ కు ఇద్దరు హీరోలు ఓకే చెప్పారుకానీ కథ చెప్పే విషయంలో పూరీ తడబడ్డాడు. దీంతో సినిమా పట్టాలెక్కలేదు. పూరీ కథను స్పష్టంగా రాసుకొని బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చివుంటే బాలయ్య, మహేష్ బాబు.. ఇద్దరూ ఓకే చెప్పేవారు. కానీ అక్కడే పూరీ తడబడటంతో వారిద్దరూ అంగీకరించలేదు. లేదంటే అప్పుడే రికార్డులు బద్దలు కొట్టే సినిమా వచ్చివుండేదని ఇద్దరు హీరోల అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేశమైనప్పటికీ ఒక మంచి కాంబినేషన్ లో సినిమా చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+