షూటింగ్‌లో బాలయ్య నడుముకు గాయాలు.. ఫ్రాక్చర్!
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకూ మహారాజ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ.156 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ అందించింది. నైజాంలో థియేటర్లు లేవని, సరైన థియేటర్లు అక్కడ కూడా ఇచ్చివుంటే ఈ సమయానికి రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించేవాళ్లమని అభిమానులు చెబుతున్నారు. కొల్లి బాబీ దర్శకత్వంలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బీబీడియోల్ తదితరులు నటించిన ఈ సినిమాకు తమన్ స్వరాలందించారు. లాంగ్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ దాటే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగి నడుం విరిగింది
ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ యాంకర్ సుమతో చిట్ చాట్ నిర్వహించింది. బాలయ్యతోపాటు దర్శకుడు బాబీ, ప్రగ్యాజైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, తమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య తనకున్న ఒక సెంటిమెంట్ ను తెలిపారు. ఆదివారం రోజు నలుపు రంగు వేసుకుంటే ప్రమాదమని, తాను ఆదివారం నలుపురంగు దుస్తులు వేయనని చెప్పారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓరోజు ప్రమాదం జరిగి నడుం విరిగిందని చెప్పారు. ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా నిర్మాతల్లో ఒకరు. ఆయన ఆరోజు షూటింగ్ కు వస్తుండటంతో హడావిడిగా నలుపురంగు చొక్కా వేసుకొని షూటింగ్ కు వచ్చినట్లు చెప్పారు.

ఆరోజు నుంచి ఆదివారం నలుపురంగు దుస్తులు వేయడం మానేశా
షూటింగ్ లో ఆయన కళ్లముందే కిందపడి నడుం విరిగిందని, ఎల్ఫా ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయినట్లు సుమతో జరిగిన ఇంటర్వ్యూలో బాలయ్య వివరించారు. ఆరోజు నుంచి తాను ఆదివారం నలుపురంగు దుస్తులు వేయడం మానేశానన్నారు. అలాగే సినిమా పూర్తయ్యేంతవరకు బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ కు రాలేదన్నారు. తాను రావడంవల్లే అలా జరిగిందని ఆయన భావించారన్నారు. డాకూ మహారాజ్ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో కొంత భాగాన్ని ప్రయాగ్ రాజ్ లో త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహా కుంభమేళాలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. అలాగే డాకూ మహారాజ్ ను కూడా హిందీ, తమిళంలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications