Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిక్కుల్లో స్టార్ హీరో, కోర్టులో సన్నిహితుల వాంగ్మూలం, హత్య చేసి హోటల్ లో గ్రాండ్ పార్టీ !

రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ సన్నిహితులు సహా నలుగురి నుంచి పోలీసులు సీఆర్‌పీసీ 104 కింద కోర్టులో వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దర్శన్‌పై ఆయన సన్నిహితులు సాక్షులుగా నిలవడంతో కన్నడ హీరో దర్శన్‌కు మరింత ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

బెంగళూరులోని పట్టగెరె షెడ్‌ వాచ్‌మెన్‌, దర్శన్‌ సహచరులు గోవిందరాజు, పునీత్‌, వినయ్‌ల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. సంఘన జరిగిన రోజున దర్శన్ తో వీళ్లందరూ కాంటాక్ట్ లో ఉన్నందున స్టేట్ మెంట్ లభించింది. దర్శన్ గ్యాంగ్ షెడ్డు వద్దకు వెళ్లిన సమయంలో వేరే రాష్ట్రానికి చెందిన హిందీ మాట్లాడే వాచ్ మెన్ గేటు తెరిచాడని, తరువాత దర్శన్, ఆయన గ్యాంగ్ షెడ్డులోపలికి వెళ్లారని పోలీసులు అంటున్నారు. వాచ్ మెన్ ప్రత్యక్షసాక్షిగా పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారని చెబుతున్నారు.

Bengaluru police officers took the statement from the close friends of Hero Darshan in the court
హీరో దర్శన్ కు షాక్, పోస్టుమార్టం నివేదిక తారుమారుకు భారీగా డబ్బులు ఆఫర్ !!

అదే విధంగా రేణుకాస్వామి హత్య తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లిన స్టార్పియో కారును పునీత్ తీసుకెళ్లాడు. వినయ్, గోవిందరాజులు షెడ్ ను శుభ్రం చేశారు. బెంగళూరులోని ఆర్. ఆర్.నగర్‌లోని గోవిందరాజు ఇంటి దగ్గర ఉన్న స్కార్పియో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ముగ్గురి వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేశారని తెలిసింది. హీరో దర్శన్ సోషల్ మీడియా ఖాతాలను పునీత్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది.

రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయే ముందు ఆర్ఆర్ నగర్ లోని ఓ హోటల్‌లో పార్టీ చేసుకున్నట్లు సమాచారం. నిందితులు కార్తీక్ (కప్ప), నిఖిల్ నాయక్, కేశవమూర్తి ఆదివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆర్‌ఆర్ నగర్‌లోని బో హోటల్‌లో బస చేశారు. హత్య జరిగినప్పుడు కార్తీక్ వేసుకున్న దుస్తులను అదే హోటల్ లో మార్చుకున్నాడు.

Bengaluru police officers took the statement from the close friends of Hero Darshan in the court

రెండు రోజుల తర్వాత కార్తీక్ దుస్తులను బీబీఎంపీ చెత్త ట్రక్కులో వేశామని హోటల్ సిబ్బంది తెలిపారు. ఈ ముగ్గురికి డబ్బులు చూపించిన దర్శన్ తన పేరు చెప్పకుండా కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు లొంగిపోవాలని దర్శన్ సన్నిహితులు సూచించారు. మృతుడు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసిన ఆ జిల్లాకు చెందిన దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర అతని మొబైల్ ఫోన్‌లను దర్శన్ సన్నిహితుడు ప్రదుష్ కు ఇచ్చాడు.

తరువాత సుమనహళ్లి సమీపంలోని డ్రెయిన్‌లో రాఘవేంద్ర ఉపయోగించిన మొబైల్ ఫోన్ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సాక్ష్యాలు లభించకూడదనే కారణంతో ప్రదుష్ ఈ ఇద్దరి మొబైల్ ఫోన్లను కాలువలో పడేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కాలువలు శుభ్రం చేసే కూలీలు కలిసి డ్రైనేజ్ పడేసిన మొబైల్ ఫోన్‌ల కోసం రోజుల తరబడి వెతికినా కనిపించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+