భగవంత్ కేసరి దూకుడు: ఆ విషయంలో చిరంజీవిని వెనక్కు నెట్టిన బాలయ్య!!
దసరా పండుగ కానుకగా రిలీజైన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా, శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించిన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ తో కొనసాగుతుంది. రిలీజ్ అయిన నాటి నుండే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది.
భారతదేశంతో పాటు విదేశాలలోనూ బాలకృష్ణ సినిమాకు ఉండే క్రేజే వేరు. ఇండియాలో మాత్రమే కాకుండా బాలయ్య సినిమాకు యూఎస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా బాలయ్య ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ ను వసూలు చేయడం ఇది వరుసగా మూడవసారి.

దీంతో టాలీవుడ్ హీరోలలో బాలయ్య ఒక్కరే ఒక మిలియన్ డాలర్ల క్లబ్ లో హ్యాట్రిక్ అందుకున్నారని బాలకృష్ణ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ గడచిన రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా వరుస హిట్ల తో దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇప్పుడు తాజాగా భగవంత్ కేసరి అదే కోవలో హిట్ అందుకొని దూసుకుపోతుంది.
భగవంత్ కేసరి విడుదలైన నాలుగు రోజుల్లోనే 71 కోట్ల కలెక్షన్లను సాధించి 100 కోట్ల రూపాయలను వసూలు చేసే వైపు దూసుకు వెళుతుంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ బాలయ్య భగవంత్ కేసరి దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లోనూ గతానికి భిన్నంగా బాలయ్య సినిమా భారీ కలెక్షన్లు సాధించింది.
ఓవర్సీస్ లో వరుసగా మూడుసార్లు వన్ మిలియన్ మార్క్ వసూళ్లను సాధించి బాలయ్య టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా భావించే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారిని వెనక్కి నెట్టారు. బాలకృష్ణ నటించిన సినిమాలు వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించడం రికార్డని, అది బాలయ్య బాబుకు మాత్రమే దక్కిందని బాలకృష్ణ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications