భగవంత్ కేసరి: కాజల్ అగర్వాల్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల.. ఎంతంటే!!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం భగవంత్ కేసరి. మొన్న విడుదలైన ఈ సినిమాకు బాలయ్య అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించారని, అనిల్ రావిపూడి ఈ సినిమాను భిన్నంగా తీశారనిసినిమాకు మంచి టాక్ వచ్చింది. మొన్న థియేటర్లో రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సందడి చేస్తుంటే, ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యాక నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రిలీజ్ కానుంది.

నందమూరి నటసింహం బాలయ్య బాబు, శ్రీలీల తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

bhagavanth kesari: sreeleela took more remunaration than kajal agarwal

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్, శ్రీలీల తీసుకున్న పారితోషకం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ఉన్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. ఒకవేళ ఆమె యాక్ట్ చేసినా సీనియర్ హీరోల సరసనే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్ కూడా బాగా తగ్గింది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కంటే కూతురు పాత్రలో నటించిన శ్రీలీల ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. భగవంత్ కేసరి సినిమాలో కాత్యాయని అనే పాత్రలో మిడిల్ ఎజ్ద్ పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం 1.5కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటే, స్టార్ హీరోయిన్ కు కాస్త దూరంలో ఉన్న శ్రీలీల కూతురు పాత్ర చేసి పెద్ద సాహసమే చేసింది.

అయినా శ్రీలీల ఈ సినిమాకు కాజల్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది. శ్రీలీల ఈ సినిమాకు 1.8 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే సొంతం చేసుకుంది. దసరా కానుకగా వచ్చిన బాలయ్య భగవంత్ కేసరి కలెక్షన్లు ఎలా ఉంటాయో మరి వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+