ఆమె వల్లే ఈ ముగ్గురు స్టార్ హీరోలయ్యారు!
ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ వారికి ఆ రేంజ్ లోనే ఇమేజ్ ఉంది. అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండగా, మహేష్ బాబు మాత్రం రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలవడానికి గతంలో చేసిన కొన్ని సినిమాలే కారణం. ఆయా సినిమాల్లో భూమికాచావ్లా హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ అనగానే అందాల ఆరబోతకు చాలా వరకు అభ్యంతరం తెలపరు. కానీ భూమిక మాత్రం సినిమాల్లో నటించేందుకు తన క్యారెక్టర్లకు ఉన్న ప్రాధాన్యతనే చూసుకునేది. ఆ ప్రకారం చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. పవన్ తనతో చేసిన ఖుషీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ గత సినిమాలన్నీ ఒక ఎత్తుకాగా, ఖుషీ ఒక్కటే మరో ఎత్తు.

మహేష్ బాబు.. భూమికతో కలిసి ఒక్కడు సినిమా చేశాడు. అది ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా మహేష్ బాబుకు స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చింది. అలా ప్రిన్స్ కు భూమిక అలా కలిసివచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో భూమిక సింహాద్రి సినిమా చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తారక్ కు మాస్ హీరో ఇమేజ్ తీసుకొచ్చి పరిశ్రమలో స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇలా భూమిక ఈ ముగ్గురు హీరోలకు ఇండస్ట్రీ హిట్ సినిమాలిచ్చి వారిని స్టార్ హీరోలుగా మార్చిందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications